స్వీటీ అనుష్క త్వరలోనే ఆడియెన్స్ కు బిగ్ షాక్ ఇవ్వబోతుందా..? ఆమె తీసుకునే నిర్ణయం వల్ల ఫ్యాన్స్ షాక్ అవడం ఖాయమా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇంతకీ అనుష్క అంతగా షాక్ అయ్యే న్యూస్ ఏం చెబుతుంది ఒకవేళ ఆమె పెళ్లి వార్త ఏదైనా చెబుతుందా అంటే దాదాపు అలాంటిదే కాని అది కాదని అంటున్నారు. అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే.. బాహుబలి, భాగమతి తర్వాత ఈమధ్యనే నిశబ్ధ సినిమా చేసింది అనుష్క. రిలీజ్ కు రెడీగా ఉన్నా సరే థియేటర్లు బంద్ అవడం వల్ల రిలీజ్ ఆపేశారు. అయితే ఓ మాట నిశబ్ధం ఓటిటిలో రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు.

 

ఇదిలాఉంటే నిశబ్ధం తర్వాత అనుష్క ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. కోలీవుడ్ డైరక్టర్ గౌతం మీనన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుందని అన్నారు కాని అది కూడా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అంతేకాదు ఆ సినిమా చేసినా చేయకపోయినా సరే అనుష్క ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలకు బ్రేక్ ఇవ్వడం కాదు పూర్తిగా సినిమాలను ఆపేసే ఆలోచనలో ఉందట అనుష్క. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని తెలుస్తుంది.

 

అనుష్కకు ఇప్పటికి సినిమా ఛాన్సులు వస్తున్నా ఆమే కావాలని ఏదో ఒక కారణం చెప్పి నో చెబుతుందట. పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే అనుష్క సినిమలేవి ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికే ఓ బిజినెస్ మెన్ తో అనుష్క మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని త్వరలోనే అఫిషియల్ న్యూస్ వస్తుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. మరోపక్క అనుష్క పెళ్లి న్యూస్ వస్తే చాలు ప్రభాస్ తో లింక్ పెట్టేస్తారు. మరి సినిమాలు ఆపేస్తే కచ్చితంగా ఆ తర్వాత పెళ్లే కాబట్టి అనుష్క ఎప్పుడు ఎలాంటి షాక్ ఇస్తుందో అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: