మసాలా ఉంటేనే కూరకు రుచి ఎక్కువ. చూసే కళ్ళకు కసి రేగాలంటే మాస్ మసాలా అవతారం ఎత్తాల్సిందే. ఈ విషయంలో హద్దులూ పద్దులూ చెరిపేయాల్సిందే. అయితే ఇన్ని చేసినా కూడా చాన్సులు వస్తాయా అంటే చెప్పలేం అంటున్నారు.

IHG

ముంబై భామలు కళ్ల ముందు కనిపిస్తూంటే వారితో మిగిలిన వారు దిగదుడుపు అయిపోతున్నారు. దాంతో ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉంటున్నారు. సై అంటూ గ్లామర్ డోస్ పెంచేస్తున్న భామలు ఇటీవల ఎక్కువైపోతున్నారు. ఒక్క చాన్స్ ఇస్తే చాలు విశ్వరూపమే చూపిస్తామని కూడా అంటున్నారు. 

IHG

తెలుగులో కొన్ని సినిమాల్లో చేసిన ఈషా రెబ్బా అబ్బా అనిపించేలా అందాల ప్రదర్శన తెగ  చేస్తోంది. ఈ అమ్మడు ఈ మధ్య తన హట్ హాట్ పిక్స్ ని ఇన్స్టాగ్రాం లో వరసగా  రిలీజ్ చేస్తూ యూత్ ని ఆకట్టుకుంటోంది. తన దగ్గర తరగని సొగసుల గనులు ఉన్నాయని చెబుతోంది.

IHG

ఇన్ని చేస్తున్నా కూడా ఆమెకు తగిన అవకాశాలు తెలుగులో రావడంలేదు. సుబ్రమణ్యపురంలో సుమంత్ తో నటించింది. ఆ మూవీలో ఆమె పాత్రకు న్యాయమే చేసినా  పెద్దగా గుర్తింపు రాలేదు.  జూనియర్ ఎన్టీయర్ అరవింద సమేత  సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్ వేసింది. 

IHG

బ్రాండ్ బాబుతో పాటు రాగల ఇరవైనాలుగు గంటల్లో వంటి సినిమాలు కూడా చేసింది. కానీ ఆమెకు సరైన ఆదరణ మాత్రం రావడంలేదు. దాంతో లాక్ డౌన్ టైం ని పూర్తిగా తన గ్లామర్ తో కట్టిపడేయాడానికి యూజ్ చేసుకుంటోంది. దాంతో ఇపుడు ఆమె పెడుతున్న పిక్స్ హాటెత్తించేస్తున్నాయి. మరి వీటిని చూసి అయినా తెలుగు లో ఆమెకు చాన్సులు ఇస్తారేమో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: