స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములోని బుట్ట బొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టిక్ టాక్ లో కూడా ఈసాంగ్ సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈవీడియో సాంగ్, యూట్యూబ్ లో మొన్నటితో 260 మిలియన్ వ్యూస్ ను రాబట్టి టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి సాంగ్ గా రికార్డు సృష్టించగా.. తాజాగా మరో ఘనత సాధించింది. యూట్యూబ్ లో 2మిలియన్లకు పైగా లైకులను రాబట్టి టాలీవుడ్ లో అత్యధిక లైకులను రాబట్టిన మొదటి వీడియో సాంగ్ గా బుట్ట బొమ్మ రికార్డు సృష్టించింది. ఈవిషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈసంక్రాంతికి విడుదలైన ఈచిత్రం 150కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈచిత్రానికి థమన్ సంగీతం అందించాడు. 
ఇదిలావుంటే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పలో నటించడానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్ డైరెక్షన్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బన్ని లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా రష్మిక కథానాయికగా నటించనుంది. ఈచిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: