ప్రభాస్ ఓ హీరోకు గాడ్ ఫాదర్ లా మారుతున్నాడు. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడి కొడుకుకు సపోర్టింగ్ లా నిలుస్తున్నాడు. ఆ కుర్రహీరో కెరీర్ నిలబెట్టడానికి రికమండేషన్స్ చేస్తున్నాడు. మనోడికి ఒక సినిమా తీసి పెట్టండని నిర్మాతలకు రిక్వెస్టులు పెడుతున్నాడు. ఇంతకీ ప్రభాస్ ఎవరికి గాడ్ ఫాదర్ లా మారాడంటే.. !


ప్రభాస్ హ్యుమానిటీ గురించి ఇండస్ట్రీ జనాలు చాలా గొప్పగా చెబుతారు. హిందీ నుంచి వచ్చిన శ్రద్ధాకపూర్ లాంటి వాళ్లు కూడా ప్రభాస్ నిజంగా డార్లింగ్ అని స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఫ్రెండ్ విషయంలో చాలా కేరింగ్ గా ఉండే ప్రభాస్, ఇప్పుడు బడ్డింగ్ హీరో సంతోష్ శోభన్ కు సపోర్ట్ ఇస్తున్నాడు. సంతోష్ కెరీర్ కు హెల్ప్ చేస్తున్నాడు ప్రభాస్.

 

వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కొడుకు సంతోష్ శోభన్ తను నేనుతో హీరోగా జనాలముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత పేపర్ బాయ్ చేశాడు. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ని మెప్పించలేదు. అయితే స్లో ఫేజ్ లో ఉన్న ఈ కుర్రాడికి బ్రేక్ ఇచ్చేందుకు ఇప్పుడు ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఫ్రెండ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లో సంతోష్ కు ఒక సినిమా సెట్ చేశాడట డార్లింగ్.  

 

ప్రభాస్ కెరీర్ ను టర్న్ చేసిన సినిమా వర్షం. కెరీర్ బిగినింగ్ లో చేసిన ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు అంచనాలు అందుకోలేకపోయాయి. ఇక మూడో సినిమాగా శోభన్ దర్శకత్వంలో చేసిన వర్షం ప్రభాస్ కటౌట్ కు తగ్గ రిజల్ట్ అందించింది. సో ఈ అభిమానంతోనే తనకు బ్రేక్ ఇచ్చిన శోభన్ కొడుకు సంతోష్ శోభన్ కు హెల్ప్ చేస్తున్నాడట ప్రభాస్. పైగా సంతోష్ ను గైడ్ చేేసేందుకు తండ్రి కూడా లేడు. అందుకే డార్లింగ్ ఈ కుర్రాడి గురించి కేర్ తీసుకుంటున్నాడని టాక్. 



మరింత సమాచారం తెలుసుకోండి: