టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా ప్రపంచానికి రెండు సంవత్సరాలు దూరం అయినా గాని చెక్కు చెదరని క్రేజ్ తో అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. రాజకీయాల్లో అంతగా రాణించలేక పోతున్న సినిమారంగంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంకా అప్పటి లాగానే ఉంది. దానికి కారణం చాలా మంది చెబుతున్నది ఏమిటంటే ఆయన బయట హీరో వెండితెరపై మీద కూడా హీరోనే అని అంటున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిన చిన్నపాటి బ్యాలెన్స్ షూట్ ఉన్న టైంలో కరోన రాకతో వాయిదా పడింది. లేకపోతే ‘వకీల్ సాబ్’ సినిమా మే 15వ తారీఖున సమ్మర్లో రిలీజ్ చేసి భారీ ఎత్తున డబ్బులు దండుకోవాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేయడం జరిగింది.

 

అయితే కరోనా వచ్చి మొత్తం ప్లాన్ లు మార్చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో సినిమా హీరోల అభిమానుల మధ్య ఆన్లైన్ వార్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తమ అభిమాన హీరో కి సంబంధించి పుట్టినరోజు గాని సినిమా టీజర్ గాని రిలీజ్ అయితే అభిమానులు సోషల్ మీడియాలో లైక్ లతో కామెంట్లతో ఈ మధ్య రికార్డులు సృష్టిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. ముందుగా ఈ ట్రెండ్ తమిళనాడులో సినిమా అభిమానులు సెట్ చేసుకోగా అది మెల్ల మెల్లగా టాలీవుడ్ కి పాకింది.

 

ఆమధ్య 'పోకిరి' సినిమా రిలీజ్ అయి 14 సంవత్సరాలు అయినా టైములో మహేష్ అభిమానులు ఆన్లైన్లో ఓ రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత ఆ రికార్డులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ బర్త్ డే నాడు భారీ స్థాయిలో రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ అభిమానులు నెలకొల్పిన రికార్డు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ పేరిట ఈ రికార్డులు బ్రేక్ చేయాలని భారీ టార్గెట్ ఫిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ముందే రికార్డులు బ్రేక్ చేసి సోషల్ మీడియాలో తామే టాప్ పొజిషన్ లో ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి అన్నీ జూలై 13న ముహూర్తం ఫిక్స్ చేశారు. మరి ఎన్టీఆర్ అభిమానుల రికార్డును పవన్ కళ్యాణ్ అభిమానులు పగలగొడతారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: