టాలీవుడ్ లో ఎక్కువగా కోలీవుడ్ లో లేదా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మన టాలీవుడ్ మేకర్స్ రీమేక్ రైట్స్ దక్కించుకొని కథలో చిన్న మార్పులు..నేటివిటీకి హీరో ఇమేజ్ కి తగ్గ సన్నివేశాలలో చేర్పులు చేసి రూపొందిస్తున్నారు. అలా చాలామంది మేకర్స్ కి హీరోలకి పరభాషా చిత్రాలు సూపర్ హిట్స్ ని ఇవ్వడం... బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ళు సాధించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కొన్ని హిందీ సినిమాలను సురేష్ బాబు రీమేక్ రైట్స్ ని దక్కించుకొని ఉన్నారు. అలాగే ఒక బాలీవుడ్ సినిమాని నితిన్..అలాగే ఒక బాలీవుడ్ సినిమాని నాగార్జున తెలుగులో చేయబోతున్నారు.

IHG

అయితే ఈ మధ్య మన వాళ్ళకి ఎక్కువగా మళయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాల మీద కన్ను పడుతుంది. అక్కడ భారీ వసూళ్ళు సాధించిన సినిమాని ఇక్కడ మేకర్స్ వెంటనే రీమేక్ రైట్స్ కొనేస్తున్నారు. అంతేకాదు భారీ స్థాయిలో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత సంవత్సరమే రెండు మళయాళ సూపర్ హిట్స్ ని మనవాళ్ళు రైట్స్ దక్కించుకున్నారు. అందులో ఒకటి లూసీఫర్. మరొకటి అయ్యప్పన్ కోషియం.

 

IHG'Ayyappanum Koshiyum' bagged by 'Aadukalam ...

లూసుఫర్ లో మోహన్ లాల్ నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు సాధించడంతో రాం చరణ్ ఆ సినిమాని తండ్రి కోసం కొనుగోలు చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ నటించనుండగా రాం చరణ్ నిర్మిస్తున్నాడు. సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అయ్యప్పన్ కోషియం కోసం బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున..ఇలా పలువురు సీనియర్ హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికి చివరికి ఈ సినిమాలో రవితేజ .. రానా నటించబోతున్నట్టు సమాచారం. 

 

IHG

ఇక మరో సినిమా గత మార్చ్ లో రిలీజ్ అయింది. అదే కప్పెలా. ఈ సినిమా భారీ వసూళ్ళు సాధించే దిశగా సాగుతున్న సమయంలో కరోనా అడ్డు పడింది. అయితే ఈ సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. విశ్వక్ సేన్ ఒక హీరోగా నటించబోతున్నాడు. మొత్తానికి ఇలా మళయాళ సినిమాలో టాలీవుడ్ లో గిరాకి బాగానే ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: