కరోనా ...ఒక్కొక్కరి జీవితాన్ని హారతి కర్పూరంలా కరిగించేస్తుంది. ఇప్పటి వరకు ఒక సామెతని చెప్పుకునేవాళ్ళం. భగవంతుడి ముందు ధనిక ..పేద అన్న తారతమ్యం..బేద భావం ఉండదు అందరూ సమానమే అని. అది ఇప్పుడు కరోనా విషయంలో కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అవును ఈ కరోనాకి కూలి పని చేసుకునే వాడి నుంచి కోట్లకి పడగలెత్తిన సినీ సెలబ్రీటీస్ ...రాజకీయ నాయకులు..బడా వ్యాపారస్తులు ..అందరూ సమానమే. అందుకే అందరిలోను దూరిపోతుంది. కరోనా సోకిందని చెప్పగలుగుతున్నారు తప్ప ఎలా .. ఎప్పుడు అనేదే ఇప్పటి వరకు ఏ ఒక్కరు కనుక్కోలేకపోతున్నారు.

 

ఒక మనిషి నుంచి మనిషికి కరోనా సోకుతుంది అంటున్నారు. అలాగే మనం కొనుగోలు చేసి వాడే వస్తువుల నుంచి..ఏటిఎం లో డ్రా చేసే డబ్బుల నుంచి వస్తుందని అంటున్నారు. ఇప్పుడు గాలి నుంచి ధూళి నుంచి వస్తుందని అంటున్నారు. ఎవరు చేసిన పొరపాటో గాని అందరి ఖర్మకి తోడయింది. వంద కోట్ల ఇంట్లో వేల కోట్ల ఆస్థులని సంపాదించుకొని మాకేం కాదులే అనుకున్న వాళ్ళని కరోనా తనేంటో చూపిస్తుంది. 

 

కరోనాకి భయపడొద్దు ..మనసికంగా ధృడంగా ఉండండి అని చెప్పిన వెంటనే కరోనా లెక్కలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ తో సహా అన్ని చిత్ర పరిశ్రమలు అగాధంలో కూరుకుపోయాయి. వేల కోట్ల వ్యాపార నష్టం. కార్మీకుల ఆకలి ఘోష. ఇవన్ని చూస్తుంటే ఇప్పటి వరకు రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాలు ఇప్పటి నుంచి పూర్తి చేసిన ఈ సంవత్సరంలో థియోటర్స్ లో బొమ్మ పడే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎంత ప్రయత్నించిన మళ్ళీ సినిమాలు థియోటర్స్ లో సందడి చేయాలంటే 2021 రావాల్సిందే అని అంటున్నారు. అయితే ఈ లోపు కొన్ని సినిమాలను మాత్రం ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఒక మాదిరి సినిమాలను రిలీజ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: