సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. ఒక పాఠం, మెసేజ్, సమాజాన్ని జాగృతి చేసే సాధనం, జీవితానుభవాల పాఠం.. అని నిరూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కథలను సినిమాలుగా తెరకెక్కించిన దర్శకులు కూడా ఎందరో ఉన్నారు. ఈ కోవలోకి వచ్చే సినిమాల్లో ఒకటి ‘గమ్యం’. క్రిష్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా కమర్షియల్ విజయమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందింది. గమ్యంలో వినోదం, స్నేహం, జీవితం, విలువలు, మనిషి.. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉంటాయి.

IHG

 

డబ్బున్న కుర్రాడిగా శర్వానంద్, డబ్బుతోపాటు నా అనేవాళ్లు కూడా లేని పాత్రలో అల్లరి నరేశ్ స్నేహితులుగా మారిన కథ గమ్యం. అనుకోని పరిచయంలో వీరిద్దరూ స్నేహితులుగా మారడం.. ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడం, తమ ప్రయాణంలో ఒకరికొకరు జీవితం గురించి అర్ధం చేసుకోవడం.. ఈ సినిమా ఇతివృత్తం. జీవితం మధ్యలో మొదలైన వారి స్నేహం మధ్యలోనే విడిపోవడం జీవితం అంటే ఏంటో తెలిసేలా చేస్తుంది. ఈ తరహా సినిమాలను తీయాలంటే ఎవరికైనా జంకు రావడం సహజమే. క్రిష్ దర్శకుడిగా పరిచయం అవుతూ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాడు. స్నేహం, జీవితం ఎంత విలువైనవో క్రిష్ చూపించిన విధానం ప్రేక్షకుల్ని ఆలోచనలో పడేశాయి.

IHG

 

మనిషి జీవితంపైనే సినిమా ఉన్నా ఇద్దరు వ్యక్తుల జీవితాలను సృశించాడు దర్శకుడు. ఈ సినిమా విడుదలై హిట్టవడంతో పాటు ఎన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. తొలి సినిమాతోనే ఫిలింఫేర్, నంది అవార్డులు గెలుచుకున్నాడు క్రిష్. ‘ఈ సినిమా తీసినోడెవడో పుస్తకాలు బాగా చదివుంటాడు’ అంటూ సినిమా చూసి ధియేటర్ నుంచి బయటకు వస్తూ ఓ ప్రేక్షకుడు అన్న మాట తనకు అద్భుతమైన ప్రశంస అని క్రిష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. గమ్యం సినిమాకు, క్రిష్ కు ఇందుకు అర్హులే.

IHG'I am happy Gamyam is doing well'

మరింత సమాచారం తెలుసుకోండి: