టాలీవుడ్ సంచలన దర్శకుడిగా పేరు దక్కించుకున్న రామ్ గోపాల్ వర్మ మాట్లాడే మాటలే  కాదు, ఆయన చేసే చేష్టలు, అలానే తీసే సినిమాలు కూడా కొంత మేర సంచలనం అనే చెప్పలి. కొన్నేళ్ల క్రితం నాగార్జునతో తీసిన శివ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన వర్మ, మొదటి సినిమాతోనే బెస్ట్ హిట్ అందుకుని తెలుగులో మరిన్ని విజయాలు అందుకున్నారు. అనంతరం బాలీవుడ్ కి వెళ్లిన వర్మ, అక్కడ బడా స్టార్స్ తో కూడా సినిమాలు తీసి సక్సెస్ఫుల్ దర్శకుడిగా నిలిచారు. కాగా ఇటీవల గడచిన కొన్నేళ్లుగా మాత్రం వర్మకు ఆశించిన రేంజ్ లో విజయాలు మాత్రం దక్కడం లేదు. 

IHG

అయితే దానికి కారణం కొన్నాళ్లుగా ఆయన పలు వివాదాస్పద అంశాలను తన సినిమాలకు కథా వస్తువులుగా ఎంచుకోవడమే అని అంటున్నారు కొందరు సినిమా విశ్లేషకులు. ఇక ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా మన దేశం మొత్తం లాక్ డౌన్ విధించబడంతో ఈ సమయాన్ని మిగతా దర్శకుల కంటే కూడా వర్మ మరింతగా సద్వినియోగం చేసుకున్నారు అనే చెప్పాలి. ఇప్పటికే శృంగార తార మియా మాల్కోవతో నేకెడ్ అనే మూవీ తీసి డిజిటల్ గా రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న వర్మ, ప్రస్తుతం కరోనా వైరస్, క్లైమాక్స్ వంటి సినిమాలతో పాటు, ఒడిశాకు చెందిన అందాల ముద్దుగుమ్మ అప్సర రాణితో థ్రిల్లర్ అనే సినిమా తీస్తున్నాడు. వాస్తవానికి ఇటీవల తెలుగులో ఊలల్ల ఊలల్ల, 4 లెటర్స్ సినిమాల్లో నటించింది అప్సర. 

 

అయితే ఆ సినిమాల సమయంలో ఆమె పేరు అంకిత రానా, కాగా ఆ పేరు కలిసి రాకపోవడంతో వర్మ సినిమా ద్వారా అప్సర రాణి గా ఆమె పేరు మార్చుకుని కనువిందు చేయనుంది. ఇక ఇటీవల కొద్దిరోజులుగా ఈ అందాల ముద్దుగుమ్మకు సంబంధించి పలు రకాల ఫోజులున్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్న వర్మ, ఆమెతో కలిసి సరదాగా మాట్లాడడం, భోజనం చేయడం వంటివి చేస్తున్న ఫొటోలతో పాటు ఆమెను గట్టిగా పట్టుకుని ముద్దాడిన ఫోటోలు కూడా పోస్ట్ చేసారు. ఎంత మీ హీరోయిన్ అయితే మాత్రం, ఆమెను మరీ అంతలా హత్తుకుని మరీ ముద్దలు పెట్టాలా వర్మ గారు అంటూ పలువురు ప్రేక్షకులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆ ఫోటోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: