కొన్నాళ్ల క్రితం తెలుగు సినిమా పరిశ్రమలో అమ్మాయిల విషయమై, మరీ ముఖ్యంగా ఇక్కడికి సినిమా అవకాశాల కోసం వస్తున్న అమ్మాయిలను మభ్యపెట్టి, పలు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్పి, కొందరు బడా సినిమా సంస్థలకు చెందిన మేనేజర్లు, కోఆర్డినేటర్లు వారిని లైంగికంగా హింసిస్తున్నారు అని వర్ధమాన నటి శ్రీరెడ్డి అప్పట్లో పెద్ద రచ్చ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కొద్దిరోజుల పాటు జరిగిన ఆ వివాదం అనంతరం మరికొందరు జూనియర్ ఆర్టిస్టులు సైతం తమకు ఈ విధమైన పరిస్థితులు ఎదురయ్యాయని ముందుకు రావడంతో శ్రీరెడ్డి లేవనెత్తిన ఉద్యమానికి కొంత మంచి పేరు వచ్చింది. 

IHG

అయితే ఆ తరువాత ఆమె అనూహ్యంగా నటుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలానే ఆయన అభిమానులతో వివాదాలు పెట్టుకోవడంతో పాటు, కొందరు సినిమా వ్యక్తులు తనని సైతం లైంగికంగా ఇబ్బదులు పెట్టారంటూ పలు ఆరోపణలు చేసింది. కొద్దిరోజుల పాటు పవన్ ఫ్యాన్స్ కు, తనకు కొంత వివాదం జరిగిన అనంతరం శ్రీరెడ్డి తన మకాంని తమిళనాడుకు మార్చింది. అయినప్పటికి కూడా అక్కడి నుండి పలువురు నటులు, రాజకీయ నాయకులను తన వ్యాఖ్యలు, వ్యంగ్యస్త్రాలతో దుయ్యపడుతున్న శ్రీరెడ్డి, ఇటీవల ఒక్కసారిగా వంటలక్కగా మారిపోయింది. 

 

కొన్నాళ్ల క్రితం తన పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టిన శ్రీరెడ్డి, ఓవైపు ఫేస్ బుక్ తో పాటు యూట్యూబ్ లో కూడా పలు రకాల వంటలను పోస్ట్ చేస్తోంది. తనకు కుకింగ్ అంటే ఎంతో ఇష్టం అంటూ శ్రీరెడ్డి చేస్తున్న వంటలను చూస్తున్న పలువురు నెటిజన్లు, అబ్బో శ్రీరెడ్డి లో ఈ రకమైన యాంగిల్ కూడా ఉందా అంటూ కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: