టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తొలి సినిమా అతడు. శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా మహేష్ బాబు పార్ధు అనే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ పాత్రలో నటించడం జరిగింది. 2005లో ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. 

IHG

ఇక కథ పరంగా చూస్తే పార్ధు అనే ఒక వ్యక్తి అనుకోకుండా రైలు ప్రమాదంలో చనిపోతాడు, అయితే అదే సమయంలో రైలులో ఉన్న ప్రొఫెషనల్ కిల్లర్ నందు, ఆపై పార్థు స్థానంలో అతని ఇంటికి వెళ్లడం, అనంతరం అతడి ఫ్యామిలీ లో ఉన్న సమస్యలు తీరుస్తూ మధ్యలో హీరోయిన్ ని ప్రేమించడం, ఆపై జరిగిన కొన్ని పరిణామాల అనంతరం, పార్ధు చనిపోగా అతడి స్థానంలో ఇంటికి వచ్చింది నందు అనే కిల్లర్ అని అందరికి తెలుస్తుంది. అయితే ఈ సినిమాలోని మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, హీరో చిన్నవయసులోనే కిల్లర్ గా మారిన తర్వాత సాధు భాయి అనే ప్రొఫెషనల్ కిల్లర్ ద్వారా మల్లి అనే కుర్రాడు అతనికి పరిచయమవడం, ఆపై పెరిగి పెద్దయ్యాక నందు, మల్లి మంచి స్నేహితులుగా మారడం జరుగుతుంది. అయితే సినిమాలోని కీలక ఘట్టమైన బాజిరెడ్డిని మర్డర్ చేసేది మల్లి కాగా, ఆ హత్య నందు మీద పడటం, ఆ తర్వాత అతని కోసం సిబిఐ ఆఫీసర్స్ వెతకటం జరుగుతుంది. 

 

మొత్తంగా చూసుకుంటే చిన్నప్పట్నుంచి మంచి స్నేహితులుగా ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టంగా పెరిగిన వారిద్దరూ, చివర్లో బాజిరెడ్డి హత్య విషయమై భీకర పోరాటానికి దిగుతారు. ఎట్టకేలకు క్లైమాక్స్ లో మహేష్ బాబు (నందు అలియాస్ పార్ధు) చేతిలో సోనుసూద్ (మల్లి) హతం అవుతాడు. ఒకరకంగా పార్ధు కథగా సాగినప్పటికీ, ఇంటర్నల్ గా మాత్రం ఇద్దరు స్నేహితుల ఫ్రెండ్ షిప్ లో మోసం ఆధారంగానే సినిమా ముందుకు నడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఇప్పటికి కూడా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అవుతూ ప్రేక్షకాభిమానంతో, మంచి రేటింగ్స్ సంపాదిస్తూ దూసుకుపోతోంది....!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: