టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్, ముందుగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. కాగా ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఉదయ్, ఆపై నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో హీరోగా అప్పటి యువతలో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ఆ తరువాత ఉదయ్ కిరణ్ నటించిన మరొక సక్సెస్ఫుల్ మూవీ నీ స్నేహం. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎమ్ ఎస్ రాజు నిర్మాతగా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా జతిన్ గ్రేవల్, అలానే హీరోయిన్ గా దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించారు. 

IHG

అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా యువత మనసులు దోచుకుంది. అనుకోకుండా జరిగిన ఒక రైలు ప్రమాదంలో స్నేహితుడు మాధవ్ (ఉదయ్ కిరణ్) ని రక్షించి అతని స్నేహితుడు శ్రీను (జతిన్ గ్రేవల్) కాలు పోగొట్టుకోవడం, స్వతహాగా మంచి ఫుట్ బాల్ ప్లేయర్స్ అయిన ఈ ఇద్దరిలో శ్రీను కాలు కోల్పోవడంతో, అతడి ఆశయసాధన కోసం మాధవ్ మరింతగా ఫుట్ బాల్ కప్స్ లో పాల్గొనడం చేస్తుంటాడు. అయితే ఒకానొక సమయంలో గోవా లో హీరోయిన్ అమృత (ఆర్తి అగర్వాల్) ని చూసిన హీరో, ఆమెను ప్రేమించడం, అనంతరం ఆపై ఆమెకు వేరొక వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయి, అనుకోకుండా మాధవ్ కారణంగా అది చెడి పోవడం, దానితో ఆమె తాతయ్య (కె విశ్వనాధ్) చనిపోవడం జరుగుతుంది. 

 

ఆ ఘటనకు మాధవ్ కారకుడనుకుని అతడిని ద్వేషిస్తున్న అమృతకు, ఆ తరువాత నుండి మాధవ్ అజ్ఞాత వ్యక్తిగా ఆమెకు పలు విధాల సాయం అందిస్తూ ఉంటాడు. అయితే ఒకానొకసాయంలో శ్రీనుని కలిసి, తనకు సాయం చేస్తోంది అతడే అని భ్రమించి అతడితో అమృత పెళ్ళికి సిద్ధం అవడం, ఆపై శ్రీను స్నేహం కోసం మాధవ్ తన ప్రేమ త్యాగం చేయడం, చివరికి అసలు విషయం తెలుసుకుని అమృతను మాధవ్ కి ఇచ్చి శ్రీను పెళ్లి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎంతో హృద్యంగా సాగె ఈ కథను, ఆకట్టుకునే విధంగా దర్శకుడు పరుచూరి మురళి తీశారు. నిజమైన స్నేహానికి గుర్తుగా నీస్నేహం సినిమా ఎప్పటికీ మన మనస్సులో నిలిచిపోతుంది.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: