అల వైకుంఠపురములో సూపర్ సక్సెస్ తర్వాత మాటల మాత్రికుడు త్రివిక్రం క్రేజ్ డబుల్ అయ్యింది. సింపుల్ కథ, కథనాలతో త్రివిక్రం చేసే సినిమాలు.. వాటి ఫలితాలు ఏ రేంజ్ లో ఉంటాయో మరోసారి ప్రూవ్ చేసింది బన్ని సినిమా. ఇక ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు త్రివిక్రం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ కాంబోలో అరవింద సమేత సినిమా వచ్చింది. ఆ సినిమా టైంలో త్రివిక్రం కు బాగా దగ్గరయ్యాడు ఎన్.టి.ఆర్. మళ్లీ ఈ ఇద్దరి కాంబో సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా పెరిగాయి.

 

ఇక ఈ సినిమాకు టైటిల్ గా అయినను పోయి రావలె హస్తినకు టైటిల్ పరిశీలనలో ఉందని అన్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ క్రేజ్ నేషనల్ వైడ్ గా పాకుతుంది. సో తర్వాత సినిమాలన్ని పాన్ ఇండియా రేంజ్ లో రిఈజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే త్రివిక్రం, ఎన్.టి.ఆర్ ప్రాజెక్ట్ ను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసేలా కథలో మార్పులు చేస్తున్నారట. అంతేకాదు టైటిల్ కూడా కేవలం తెలుగు వరకే ఒకటి మిగతా భషల్లో మరోటి అని కాకుండా అన్ని భాషల్లో ఒకటే టైటిల్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ కూడా నేషనల్ స్టార్ అయినట్టే.

 

త్రివిక్రం సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో తారక్ సినిమా ఉంటుందని తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. సో ఆ సినిమా కూడా తెలుగు, తమిళం, కన్నడ, మళ్యాళంతో పాటుగా హిందిలో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. త్రివిక్రం సినిమాలకు బాలీవుడ్ లో కూడా డిమాండ్ ఎక్కువే. మరి ఈసారి ఎన్.టి.ఆర్ తో డైరెక్ట్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న గురూజి ఆ సినిమాతో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: