హరీష్ శంకర్ సినిమాలలో హీరోయిజమ్ ఎలివేషన్ చాలఎక్కువగా ఉంటుంది. దీనికితోడు తన సినిమాలలో వినోదం కమర్షియల్ అంశాలు ఇలా ప్రతివిషయం సమపాళ్ళల్లో ఉండేలా చూసుకుంటూ తన సినిమాలను హిట్ చేయడానికి తనవంతు ప్రయత్నాలు ఈదర్శకుడు చాల ఏకాగ్రతతో చేస్తూ ఉంటాడు.


ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల షూటింగ్ లు నిలిచిపోవడంతో ఇంటివద్దనే ఉంటున్న హరీష్ శంకర్ ఒకప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాల పై స్పందించాడు. ప్రస్తుత కరోనా పరిస్థితులు వల్ల తనలో వచ్చిన మార్పులు గురించి మాట్లాడుతూ ఈకరోనా తనలోని మానవత్వాన్ని మరింత తట్టిలేపిందని వలస కార్మీకులు దినసర కూలీలు చిరువ్యాపారాలు పడుతున్న కష్టాలను చూసిన తరువాత తనకు డబ్బు విలువ బాగా తెలిసివచ్చింది అంటూ కామెంట్స్ చేసాడు.


ఇదే సందర్భంలో సినిమారంగంలో పెరిగిపోతున్న బంధుప్రీతి ఆశ్రితపక్షపాతం విషయాల పై స్పందిస్తూ ఇదికేవలం సినిమా రంగంలోనే కాకుండా అన్నిరంగాలలోను కొనసాగుతున్న సమస్య అనీ దీనిగురించి విపరీతంగా ఆలోచించి చర్చలు చేయడం అనవసరం అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఏరంగంలో అయినా ఎవరైనా తమ ప్రతిభ చూపెట్టి మాత్రమే ఎదుగుతారని కేవలం బంధువులు సహకరించినంత మాత్రాన ఒకవ్యక్తి ఎదగలేదు అంటూ కామెంట్స్ చేసాడు.


జనం ఇప్పటివరకు బంగారం ఆస్థులు డబ్బు సంపాదనలను గురించి తెల్లారిన దగ్గర నుండి ఆలోచన చేసారని అయితే ఇప్పుడు ఎంతటి గొప్పవ్యక్తి అయినా ఇప్పుడు అన్ని నిత్యావసర వస్తువులు ఉన్నాయా కూరగాయలు ఉన్నాయా అని చూసుకుంటున్న ఒకవిచిత్రమైన పరిస్థితికి గొప్పవాళ్ళను కూడ ఒకమెట్టు దిగజార్చింది అంటూ హరీష్ భావయుక్తంగా కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం జనాన్ని నిద్రపొనీయకుండా చేస్తున్న కరోనా పరిస్థితుల పై ఒకచిన్న ఐడియా చెప్పి తన టీమ్ చేత కథ వ్రాయిస్తున్న విషయాన్ని బయటపెడుతూ త్వరలో ఓటీటీ వేదికలకు అనుగుణంగా తాను ఒకసినిమాను తీయబోతున్న విషయాన్ని వివరించాడు. అయితే ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కరోనా పై తాను ఒకసినిమాను తీస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పిన పరిస్థితులలో ఆవిషయాలను పట్టించుకోకుండా హరీష్ శంకర్ ఇప్పుడు తాను కూడ ఈకరోనా పై సినిమాను తీస్తున్నాను అని సంకేతాలు ఇవ్వడం ఒకవిధంగా వర్మకు షాకింగ్ న్యూస్ అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: