బుల్లితెర యాంకర్ శ్రీముఖి తన అల్లరితో ఏ షో చేసినా సూపర్ హిట్ అవుతుంది. పటాస్ షోతో ఆమె తెచ్చుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు ముందు సినిమాల్లో ప్రయత్నించి అక్కడ సైడ్ రోల్స్ మత్రమే వస్తున్నాయని స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయిన ఈ భామ ఇక్కడ బాగా క్లిక్ అయ్యింది. టివి ఆన్ చేస్తే చాలు ఏదో ఒక ఛానెల్ లో ఏదో ఒక షో చేస్తూ శ్రీముఖి కనిపిస్తుంది. లాక్ డౌన్ గ్యాప్ లో ఇంట్లో ఉండి హ్యాపీగా గడిపిన శ్రీముఖి అన్ లాక్ చేయగానే స్మాల్ స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది అనుకుంటే అమ్మడు ఇంకా ఏ షో చేయట్లేదు.

 

ఈమధ్య కాలంలో ఎప్పుడు ఇన్నిరోజులు ఇంట్లో ఉండలేదని లాక్ డున్ టైం లో ఫ్యాన్స్ తో చాట్ చేస్తూ చెప్పిన ఈ అమ్మడు లేటెస్ట్ గా ఓ క్రేజీ ఫోటో షూట్ తో అలరిస్తుంది. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునేలా శ్రీముఖి చేసిన ఈ ఫోటో షూట్ చూస్తే అమ్మడు సిగ్గుమొగ్గలేస్తుందని అనిపిస్తుంది. బుల్లితెర మీద రాములమ్మ ఇమేజ్ సాధించిన ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 3లో కూడా తన బెస్ట్ ఇచ్చింది. అందుకే రన్న్నర్ గా నిలిచింది. ఈమధ్య షోలు చేయకపోయినా తన ఫ్యాన్స్ తనని మిస్ అవుతారని భావించి ఫోటో షూట్ తో అలరిస్తుంది అమ్మడు.

 

శారీ కట్టుకుని సింపుల్ గానే కనిపిస్తున్నా అమ్మడి లుక్స్ కు ఆడియెన్స్ అంతా ఫిదా అయ్యేలా ఉన్నారు. సినిమాల్లో అప్పుడప్పుడు లక్ టెస్ట్ చేసుకుంటున్నా సరే ఆమెకు స్మాల్ స్క్రీన్ పైనే క్రేజ్ వచ్చేలా చేసింది. చేయాలే కాని ఆమెకి బుల్లితెర మీద వరుస షోలు అవకాశం వస్తాయి. బిగ్ బాస్ తో మరింత ప్రేక్షకులకు దగ్గరైన శ్రీముఖి త్వరలోనే ఓ క్రేజీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తుంది. పటాస్ షోలో శ్రీముఖి ఎగ్జిట్ తర్వాత రవి కూడా బయటకు వచ్చాడు. వీళ్లిద్దరు బయటకు వచ్చాక ఆ షోకి రేటింగ్ తగ్గిపోయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: