ప్రస్తుతం వైసీపీ పార్టీలో కీలక నేతగా... ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అతి సన్నిహితమైన మనిషిగా... నగరి ఎమ్మెల్యే గా ఉంది రోజా. అయితే ఆంధ్ర రాజకీయాల్లో రోజా ఎంత కీలక నేత ను అందరికీ తెలిసిన విషయమే. కాగా ఓ వైపు రాజకీయాలలో ఎంతో విజయవంతంగా రాణిస్తూనే మరోవైపు... బుల్లి తెరపై తన అభిమానులందరినీ అలరిస్తున్న విషయం తెలిసిందే, ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ జడ్జ్ గా కొనసాగుతూ... తన నవ్వులతో జబర్దస్త్ లో  సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయింది రోజా. రాజకీయాల్లో రాణించినప్పటికీ... మంత్రి హోదా ఉండే ఏపీఐఐసీ చైర్మన్ పదవిని చేపట్టినప్పటికీ జబర్దస్త్ ని మాత్రం వదలలేదు. మామూలుగా అయితే రోజా కి జబర్దస్త్ ద్వారానే బాగా అదృష్టం కలిసివచ్చింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే... ప్రస్తుతం బుల్లితెరపై ఒక జబర్దస్త్ షో లో తప్ప మిగతా షో ల జోలికి వెళ్లడం లేదు రోజా.



మిగతా షోలలో జడ్జిగా రావాలని పిలుపు వచ్చినప్పటికీ కూడా  రోజా తిరస్కరిస్తుంది అనే టాక్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రోజా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నిన్నటి తరం నటీమణులు  అందరూ ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో రోజా కూడా రీ ఎంట్రీ  ఇస్తే బాగుండు అని అభిమానులు ఆశపడుతున్నాను. రోజ కి వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయని టాక్ కూడా ఉంది. బాలయ్య బోయపాటి సినిమా లో తెరకెక్కుతున్న సినిమాలో  రోజా కి ఆఫర్ వచ్చినా తిరస్కరించింది అని టాలీవుడ్లో అప్పట్లో ప్రచారం జరిగింది.



ఇక ఇటీవల అల్లు అర్జున్ సుకుమార్ సినిమాలో విలన్ పాత్ర కోసం ఆఫర్ వచ్చినా కూడా చేయను అని చెప్పేసిందట. ఇక ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ లో చిరంజీవి తో పాటు ఓ ముఖ్య  పాత్రలో నటించే అవకాశం వచ్చినా నో   చెప్పిందట రోజా. అయితే ఇలా సినిమాలకు నో చెప్పడానికి వెనుక పెద్ద రీసన్  ఉంది అని  చర్చించుకుంటున్నారు చాలామంది. బుల్లితెరపై జబర్దస్త్ లో జడ్జిగా చేసినప్పటికీ ఎలాంటి అభ్యంతరం చెప్పని జగన్.. నందమూరి మెగా ఫ్యామిలీ హీరోలతో సినిమాల విషయంలో మాత్రం షరతులు  పెట్టినట్లు సమాచారం. అందుకే ఇలా రోజా వారి  సినిమాలకు దూరంగా ఉంటుందట.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: