సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ పవర్ స్టార్. తన సినిమాలో హీరో పేరు మాత్రమే పవర్ స్టార్ అంటూ ఇన్ డైరెక్ట్ గా.. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన ఆర్జివి ఈ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు. మెగా ఫ్యామిలీ అంటే అంతెత్తున లేచే ఆర్జివి పవర్ స్టార్ సినిమాలో చాలా విషయాలు ప్రస్థావిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్ చూస్తుంటే ఆర్జివి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ ను కెలికినట్టు ఉన్నాడు.

 

అయితే పవర్ స్టార్ సినిమా రిలీజ్ కు శ్రేయాస్ ఈటి నో చెబుతుందట. పవన్ కళ్యాణ్ మీద నెగటివ్ గా చేస్తున్న ఈ సినిమా తీస్తే శ్రేయాస్ మీడియా వారి మీద మెగా హీరోస్ సీరియస్ అవుతారనే ఆలోచనతో ఈ సినిమాను శ్రేయాస్ ఈటిలో రిలీజ్ చేయడానికి నో చెప్పారు. ఇక ఐస్ క్రీం సినిమా తీసిన రామ సత్యనారాయణ భీమవరం టాకీస్ పేరుతో ఓ ఏటిటి స్టార్ట్ చేశాడు. అయితే ఆయన ఈ పవర్ స్టార్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక పవర్ స్టార్ సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఛానెల్ ఎం.ఎక్స్ ప్లేయర్ ఈ సినిమాను కొనేందుకు ముందుకొచ్చిందట.

 

పవర్ స్టార్ సినిమాను అవుట్ రైట్ రేటుకి కొనేసి ఆన్ లైన్ లో పెట్టాలన్ భావిస్తున్నారట ఎం.ఎక్స్ ప్లేయర్ నిర్వాహకులు. ఆర్జివి నిర్ణయం కోసం వారు ఎదురుచూస్తున్నారట. క్లైమాక్స్, నగ్నం సినిమాలు శ్రేయాస్ ఈటిలో రిలీజ్ చేసిన వర్మ పవర్ స్టార్ సినిమాను మాత్రం అక్కడ కుదరక బయట వారికి ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎం.ఎక్స్ ప్లేయర్ అయితే పే పర్ వ్యూ కాన్సెప్ట్ ఉండదు. సినిమాను మొత్తానికి అమ్మేయాల్సి ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: