ఆర్ ఎక్స్ 100 సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండేళ్ళ క్రితం రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బోల్డ్ సీన్లతో యువతని బాగా ఆకర్షించింది. ట్రైలర్ వదిలినపుడు అంతా అర్జున్ రెడ్డి సినిమాలా ఉందనుకున్నారు. కానీ థియేటర్ కి వెళ్ళి చూస్తే గానీ తెలియలేదు దానికీ, దీనికీ ఎంత తేడా ఉందో.

IHG

కార్తికేయ హీరోగా, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. వర్మ శిష్యుడైన అజయ్ భూపతి కి కి దర్శకుడిగా మంచి పేరొచ్చింది. అంతకుముందు ఒకటి రెండు సినిమాలు చేసినా గుర్తింపు లేకుండా ఉన్న కార్తికేయ ఒక్కసారిగా ఆర్ ఎక్స్ 100 సినిమాతో అందరికీ గుర్తుండిపోయాడు. హీరోయిన్ గా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కి మొదటి సినిమానే అయినా చక్కగా నటించి, తన గ్లామర్ తో మెప్పించింది.

IHG

సినిమాలో ఇంకా రావు రమేష్, రామ్ కీ వంటి సీనియర్ నటులు కూడా ఉన్నారు. అయితే నిన్నటికి ఈ సినిమా రిలీజై రెండేళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ తన స్పందనని ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. జులై 12వ తేదీని ఎప్పుడు తలుచుకున్నా అదోలాంటి అద్భుతం తన ముందు కనిపిస్తుందట. కలలపై నమ్మకం కలిగిస్తుందట. ఇంకా జీవితంపై ఆశని కలిగిస్తుందని అంటున్నాడు.

 

అంతే కాదు ఈ తేదీన తనకి మరోజన్మ కలిగిందని చెబుతున్నాడు. ఆర్ ఎక్స్ 100 తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రమే కాదు తనకి మరో జన్మ ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఆ మరో జన్మకి కారణం దర్శకుడు అజయ్ భూపతి అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: