ఒకప్పుడు లవర్  బాయ్ గా మన అందరిని మెప్పించిన హీరో తరుణ్. అటు యూత్ ఇటు  అమ్మాయిలు తరుణ్ అంటే చాలా ఇష్టపడేవారు. ఒకప్పుడు యూత్ ని ఉర్రుతలూగించిన హీరో తరుణ్. తర్వాత అవకాశాలు లేక  తీసిన సినిమాలు హిట్ అవ్వక సినిమాలకు దూరం అయ్యాడు. కానీ తరుణ్ నటించిన ప్రతి సినిమా కూడా మంచి పెరు తెచ్చిపెట్టింది. అయితే వాటిలో చెప్పుకోదగ్గ సినిమా నవ వసంతం. ఇది ఒక తమిళ రీమేక్ సినిమా. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తమిళంలో తరుణ్ హీరోగా రూపొందించిన సినిమా పున్నగాయి దేసమ్. ఆ సినిమానే  అదే బ్యానర్ నవవసంతం పేరుతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.

 

 

ఈ సినిమాలో స్నేహ బంధం గురించి బాగా చూపించారు. స్నేహం కోసం,  స్నేహితుల కోసం తరుణ్ చాలా కష్టపడి స్నేహితులు  కలలు కన్న జీవితాన్ని వాళ్ళకి అందిస్తాడు తరుణ్. నవవసంతం  సినిమా "ఫ్రెండ్‌ షిప్పే తియ్యని పుష్పం.. ఫ్రెండ్‌ షిప్పే గుండెలో శ్వాసం" అనే  పాటతో  కొనసాగుతుంది. ఈ సినిమాలో గణేష్ పాత్రలో తరుణ్ నటన అందరిని మెప్పించింది.తరుణ్ కి మిత్రులుగా ఆకాష్,  రోహిత్,సునీల్ లు నటించారు. ఈ ముగ్గురి స్నేహితులకు ఒక్కొకలకి ఒక్కో టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ గమ్యాన్ని చేరడానికి వాళ్లకి సరైన ఎదుగుదల ఉండదు.అయితే తమ ఆశలను నెరవేర్చుకోవడానికి వారి వద్ద డబ్బు ఉండదు.

 

 

 

 

వారి ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి తరుణ్ చాలా ప్రయత్నాలు చేసి వాళ్ళని ఒక గొప్ప స్థితిలో ఉంచుతాడు. కని పెంచిన అమ్మ నాన్నలే వాళ్ళ  బిడ్డలలో ఉన్న నైపుణ్యతని గుర్తించలేకపోయారు.కానీ ఒక్క స్నేహితుడు మాత్రమే తన స్నేహితుల టాలెంట్ ను గుర్తించాడు. తన స్నేహితులను  గొప్ప పొజిషన్ లో ఉంచి తరుణ్ మాత్రం ఒక చిన్న హోటల్ పెట్టుకుంటాడు.తరుణ్ తో పాటు సునీల్, ఆకాష్, రోహిత్ కూడా తమ పాత్రలకు న్యాయం చేస్తారు.. స్నేహంకన్నా గొప్పది మరేదీ లేదని ఈ సినిమాలో బాగా చూపించారు..  తల్లితండ్రులతో పంచుకోలేని కొన్ని విషయాలు మనం స్నేహితులతో పంచుకుంటాం అది స్నేహంలో ఉన్న గొప్పతనం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి: