స్నేహం కంటే గొప్పది ఈ ప్రపంచంలో మరెక్కడా లేదు.స్నేహం ఏప్పుడు ఎవరితో పుడుతుందో కూడా మనం చెప్పలేము. మనల్ని కని పెంచిన తల్లితండ్రులు, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇలాంటి ఎన్నో రక్త సంభందాలు ఉంటాయి మనకు. కానీ ఎటువంటి రక్త సంభందం లేకుండా పరిచయమయ్యేది ఒక ఫ్రెండ్ మాత్రమే. స్నేహం గూర్చి ఎంత చెప్పిన తక్కువే. మన టాలీవుడ్ లో స్నేహానికి సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. ఒక్కో సినిమాలో ఒక్కోలాగా స్నేహం గూర్చి గొప్పగా తీశారు.అలాంటి కోవకి చెందిన సినిమా  "ఓ మై ఫ్రెండ్ " హీరో సిద్దార్ధ అండ్ శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా. వీళ్ళకి జోడిగా హన్సిక అండ్ నవదీప్ కూడా నటించారు ఈ సినిమాలో.

 

 

 

 

అన్ని సినిమాల్లో కంటే కొంచెం డిఫరెంట్ గా ఈ సినిమాలో స్నేహం గూర్చి తెలియచేసారు. స్నేహానికి ఆడ మగ అనే తేడా లేదని ఈ సినిమాలో చక్కగా చూపించారు. చిన్నపటి నుంచి సిద్దార్ధ్ అండ్ శృతిహాసన్ మంచి స్నేహితులు.. వీళ్ళ స్నేహాన్ని తల్లితండ్రులు కూడా ప్రేమగా భావించి పెళ్లి చేద్దామనుకుంటారు. కానీ వీళ్ళ ఇద్దరు మేము ఎప్పటికి ఇద్దరమూ స్నేహితులులాగానే ఉంటాము అని చెప్పి స్నేహం యొక్క విలువను మరింత పెంచుతారు. ఒక ఆడ మగ స్నేహంగా ఉంటే అది ప్రేమ అనుకోడం తప్పు అని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియచేస్తారు. స్నేహానికి రంగు, రూపు, ఆడ, మగ అనే తేడా లేదు.. మన బాధల్ని పంచుకునేవాడు స్నేహితుడు.

 

 

 

 

కష్టంలో ఉన్నపుడు వదిలేసి అన్ని ఉన్నపుడు మనతో ఉండేవాళ్ళు స్నేహితులు కాదు. స్నేహం కోసం ప్రేమించిన అబ్బాయిని వదులుకుంటుంది శృతిహాసన్. అలాగే స్నేహితురాలి కోసం తను ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటాడు సిద్దార్ధ్.. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు  స్నేహమంటే ఒక గొప్ప అనుబంధం అనే విషయాన్నీ తెలియచేసారు. స్నేహానికి ఆడ మగ అనే తేడా లేదని ఒక గొప్ప మెసేజ్ ను ఇచ్చారు ఈ సినిమాలో. జీవితంలో ఒక మంచి పుస్తకం కొనుక్కోవడం కన్నా ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోడం మిన్నా అని ఒక కవి అన్నది నిజం.. ఇదే అక్షర సత్యం..

మరింత సమాచారం తెలుసుకోండి: