ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన నన్బన్ సినిమా తెలుగులో స్నేహితుడు గా డబ్ చేయబడింది. 2012వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని అంశాల గురించి చాలా చక్కగా చూపించింది. ఈ చిత్రంలో విజయ్, ఇలియానా, జీవా, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కాలేజీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అందరిని ఆలోచింప చేసింది అని చెప్పుకోవచ్చు. సినిమా కథ గురించి తెలుసుకుంటే పంచబట్ల సారంగపాణి(విజయ్) ఇంజనీరింగ్ కాలేజీలో చేరినప్పుడు రూమ్మేట్స్ అయినా వెంకట రామకృష్ణ శనక్కాయల రవి మంచి స్నేహితులవుతారు. వీళ్ళ కాలేజీ స్నేహం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పుకోవచ్చు. 

 


ముగ్గురు మంచి స్నేహితులే అయినప్పటికీ వారి అభిప్రాయాలు, ఆశయాలు వేరే రకంగా ఉంటాయి. దీంతో పంచబట్ల సారంగపాణి తన స్నేహితులిద్దరినీ సరైన మార్గంలో నడిపించాలని కోరుకుంటాడు. వెంకట రామకృష్ణ ఫోటోగ్రాఫర్ అవ్వాలని  అనుకుంటాడు కానీ తన తండ్రి ఒత్తిడితో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. శనక్కాయల రవి చాలా పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాగా ఒక మంచి జాబ్ సంపాదించి తమ కుటుంబాన్ని పోషిస్తే చాలు అనుకుంటాడు. పంచబట్ల సారంగపాణి మాత్రం అసాధారణమైన విద్యార్థిగా ఉంటూ మార్కుల కంటే జ్ఞానానికి మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. 

 


వారి స్నేహం లో జరిగే ఎన్నో అద్భుతమైన క్షణాలు ప్రేక్షకులను వెండి తెరకు కట్టిపడేస్తాయి. ఈ సినిమా లో బిగ్గెస్ట్ మైనస్ విజయ్ అని చెప్పుకోవచ్చు. నిజానికి తెలుగు సినీ ప్రేక్షకులు విజయ్ ని హీరో గా అస్సలు అంగీకరించరు. ఇతను హీరో ఏంటి అన్నట్లు చూస్తారు. అలాంటిది ఈ సినిమాలో విజయ్ నిద్రపోతున్నట్టు కనిపించి... అసలు నటనా చాతుర్యం ఏమాత్రం చూపించకుండా తెలుగు ప్రేక్షకులకు బాగా బోర్ కొట్టించాడు. అతనిని మినహాయించే సినిమా అంతా చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: