1999వ సంవత్సరంలో విడుదలైన స్నేహం కోసం సినిమాలో చిరంజీవి తండ్రి-కొడుకు గా ద్విపాత్రాభినయం చేయగా... విజయకుమార్, ప్రకాష్ రాజు, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. విజయకుమార్ వద్ద పనిచేసే సింహాద్రి అతడికి ఎంత గౌరవం ఇచ్చి ప్రాణంగా చూసుకుంటుంటాడు. సింహాద్రి తన పట్ల చూపించే ప్రేమ కు ఫిదా అయిపోయిన విజయకుమార్ అతడిని పని వాడిలా చూడకుండా స్నేహితుడిలా భావిస్తుంటాడు. ఎన్నో సందర్భాల్లో విజయకుమార్ ప్రాణాలను కాపాడుతాడు సింహాద్రి. దాంతో విజయకుమార్ సింహాద్రి ని బాగా ఇష్టపడి అతడితో స్నేహితుడిగా మెలుగుతాడు. విజయకుమార్ పెద్ద కూతురు అయిన గౌరీ(సితార)పెళ్లి విషయంలో జోక్యం చేసుకున్న సింహాద్రి చుట్టమైన పెద్దబ్బాయి( ప్రకాష్ రాజ్) కి ఇవ్వాలని సలహా ఇస్తే... అతను మంచోడు కాదని ఎందుకు అతడికి ఇవ్వాలని విజయకుమార్ చడామడా తిడతాడు. దీంతో సింహాద్రి బాగా అలిగి వెళ్ళిపోతాడు.

 


అప్పుడే ఈ సినిమాలో "మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ... రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువ... కోపమెక్కువ కానీ మనసు మక్కువ... ప్రేమ పంచిన తీరులోన నే నిన్ను మించగలనా... ఏ పుణ్యం చేసానో నే నీ స్నేహం పొందాను.. నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా... నీకు సేవ చేసేందుకైనా మరుజన్మ కోరుకోనా", అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన పాట వస్తుంది. స్నేహం గురించి రూపుదిద్దుకున్న ఈ పాట ప్రతి ప్రేక్షకుడి మనసుని నేరుగా తాకిందని చెప్పుకోవచ్చు. సింహాద్రి సలహాకు గౌరవం ఇచ్చి విజయకుమార్ తన పెద్ద కూతురు గౌరీ ని పెద్ద అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ పెద్దబ్బాయి కేవలం ఆస్తి కోసమే ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడని గౌరీ తల్లికి తెలుస్తుంది. దీంతో సొంత అక్క అని కూడా చూడకుండా ఆమెను చంపేస్తాడు పెద్దబ్బాయి. ఈ నేరం సింహాద్రి పైన పడుతుంది. కానీ ఈ విషయాన్ని విజయకుమార్ నమ్మడు. 

 


ఒకానొక రోజు జైలు కి వెళ్లి అసలు విషయం తెలుసుకొని గౌరీని పెద్దబ్బాయి ఇంటి నుండి బయటకు గెంటి వేస్తాడు. అలాగే సింహాద్రి కొడుకుని ఇంటికి తెచ్చి పెట్టుకుంటాడు. ఆ విధంగా సింహాద్రి కుమారుడు చిన్నయ్య విజయకుమార్ వద్దే పెరిగి పెద్ద అవుతాడు. సింహాద్రి కారాగార శిక్ష అనుభవించిన తరువాత తన కొడుకుని చూడకుండా నేరుగా విజయకుమార్ కూతుర్లను చూడడానికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ విజయ కుమార్ కి దగ్గరకు వెళ్లి అయన కుటుంబాన్ని చక్కదిద్ధి చనిపోతాడు సింహాద్రి. అయితే ఈ సినిమాలో చివరి వరకు చోటుచేసుకునే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. క్లైమాక్స్ ప్రేక్షకులందరినీ ఏడిపించేసిందని చెప్పుకోవచ్చు. స్వచ్ఛమైన స్నేహం అంటే ఏంటో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు దర్శకుడు కె.ఎస్ రవికుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: