పెళ్లి చూపులు... ఈ తరం యువతకు చాలా బాగా నచ్చిన సినిమాల్లో ఒకటి. ఆ సినిమాలో చూపించిన కొన్ని కొన్ని కోణాలు యువతకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. కొన్ని కొన్ని సీన్స్ ని చాలా అందంగా చూపించాడు దర్శకుడు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రతీ సీన్ లో కూడా అతను చాలా అందంగా నటిస్తూ ఉంటాడు. ఈ సినిమా తర్వాతనే అతను స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేసింది కూడా. ఈ సినిమాలో అతని నటనకు అవార్డ్ కూడా వచ్చింది అనే చెప్పాలి. 

 

హీరోయిన్ గా నటించిన రీతు వర్మ కూడా చాలా బాగా నటించి మెప్పించింది ఈ సినిమాలో అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటనకు చాలా వరకు మంచి మార్కులే పడ్డాయి. పోగరు ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించింది. గ్లామర్ అనే దానికి ఎక్కువగా ప్రాధాన్యత లేకుండా నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నటనకు అన్ని విధాలుగా ఆమె న్యాయం చేసింది అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్నేహం కూడా చాలా బాగుంటుంది. హీరోతో పాటుగా ఉండే ప్రియధర్షి  నటన చాలా బాగా ఆకట్టుకుంది. 

 

ఆ సినిమాలో అతని నటన చూసి చాలా మంది ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. అంత అందంగా అతను నటించాడు. ఇక వారి మధ్య స్నేహం కూడా చాలా బాగా ఆకట్టుకుంది జనాలను. స్నేహం అనే కోణం పరంగా చూస్తే ఒక ఫ్రెండ్ కి అన్ని విధాలుగా మద్దతుగా నిలిచే ఫ్రెండ్స్ ఈ సినిమాలో ఉంటారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా అపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: