నాగార్జున హీరోగా వచ్చిన చిత్రం మాస్. మాస్ సినిమా నాగార్జున కెరీర్ లోనే అతిపెద్ద విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున నటన రాఘవా లారెన్స్ దర్శకత్వం సహా ప్రతీ ఒక్కటి కూడా హైలెట్ గా ఉంటాయి. ఈ సినిమా సాధించిన విజయం తర్వాత తెలుగులో లారెన్స్ కి దర్శకుడిగా మంచి డిమాండ్ వచ్చింది. ఈ సినిమా ఇక వసూళ్ళ పరంగా చూసినా సరే భారీగానే వసూళ్లు సాధించింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత నాగార్జున కు మాస్ లో మంచి ఇమేజ్ వచ్చింది అనే చెప్పాలి. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున తో పాటుగా సునీల్ నటన కు చాలా మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో నాగార్జున సునీల్ ఇంటికి అద్దెకు వెళ్ళగా వారి ఇద్దరికీ మధ్య స్నేహం అనేది చిగురించడం అతని ప్రాణ స్నేహితుడు కావడం ఆ తర్వాత అతన్ని చంపేయడం వంటివి ఉంటాయి. ఇక తన ఫ్రెండ్ ని చంపడం పై నాగార్జున పగ పెంచుకోవడం వంటివి ఈ సినిమాలో చాలా బాగా ఆకట్టుకున్న విషయాలు. ఈ సినిమా చాలా వరకు కూడా స్నేహం కి మంచి ప్రాధాన్యత ఉండే విధంగా చూపించిన కాసేపు చూపించారు. 

 

సినిమా తర్వాత అలాంటి కథల కోసం చాలా మంది నటులు చూసారు గాని ఆ రేంజ్ సినిమా మాత్రం  రావడం లేదు. ఈ సినిమా తర్వాత నాగార్జున కూడా అలాంటి కథలు చెయ్యాలి అని చూసినా సరే ఆ రేంజ్ లో కథలు మాత్రం దాదాపుగా రాలేదు అనే మాట వాస్తవం. ఇప్పటికి కూడా అలాంటి మంచి కథ వస్తే ప్రేక్షకులు చూడటానికి రెడీ అవుతున్నారు. మరి ఎప్పుడు ఆ రేంజ్ లో మంచి సినిమా వస్తుందో చూడాలి ఇక.

మరింత సమాచారం తెలుసుకోండి: