మన తెలుగు లో చాలా వరకు మంచి విజయం సాధించిన సినిమాల్లో స్నేహం కోణం కూడా బాగానే ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే స్నేహం అనే కోణం చాలా బాగా ఆకట్టుకుంటుంది జనాలను అని చెప్పవచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా స్నేహం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన తెలుగు లో  మహేష్ బాబు సినిమాలు అదే విధంగా రవితేజా సినిమాల్లో ఈ స్నేహం కోణం మనం ఎక్కువగా చూసాం... ఏదోక రూపంలో వారి వారి సినిమాల్లో స్నేహం అనేది కమెడియన్ తోనో లేక ఎవరితో అయినా చూపించే విధంగా ఉంటుంది. 

 

రవితేజా సినిమాలో ప్రత్యేకంగా స్నేహం గురించి చూపించిన సినిమా ఒకటి ఉంది. అది ఏంటీ అంటే భద్ర. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎక్కువగా స్నేహం చూపించారు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడం తన ఫ్రెండ్ చెల్లిని అతను ప్రేమించడం ఆ తర్వాత తన ఫ్రెండ్ చెల్లిని తెచ్చి తన ఇంట్లో పెట్టుకోవడం తన ఫ్రెండ్ ని అతని ఫ్యామిలీ ని చంపిన వారిని వ్యక్తిగతంగా తీసుకుని రవితేజా చంపడం వంటివి చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా లో ఆ సీన్స్ చాలా బాగా హైలెట్  అయ్యాయి అనే చెప్పాలి. 

 

ఇక లాంటి సినిమా మళ్ళీ రవితేజా చేస్తే బాగుంటుంది అని చాలా మంది అన్నారు గాని ఆయన మాత్రం అలాంటి సినిమాలు చేయడం లేదు. ఇక ఆ సినిమా మాస్ ని క్లాస్ ని అన్ని విధాలుగా ఆకట్టుకోవడమే కాదు బోయపాటి శ్రీను ని స్టార్ ని చేసింది అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆయనకు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: