పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చదువుకుంటున్న రోజుల్లో కంప్యూటర్ క్లాసులకు వెళ్లేవాడు. ఆ సమయంలో అతను అమ్మాయిల కోసమే క్లాస్ లకు వెళ్లే కొంతమంది ఆకతాయిల గ్యాంగ్ లో చేరిపోయాడు. తమతో పాటు కంప్యూటర్ క్లాస్ కి వచ్చే అమ్మాయిలకు ఎప్పుడూ లైన్ చేస్తుండేవారు ఈ గ్యాంగ్. అయితే పవన్ కళ్యాణ్ కి ఒక అమ్మాయి విపరీతంగా నచ్చేసింది. ఆమెను చూడగానే అతని గుండెల్లో ఏదో దడ పుట్టేది, ఆమెపై ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడేంత ధైర్యం కూడా పవన్ కళ్యాణ్ కి అప్పట్లో ఉండకపోయేది.


పవన్ తన ఇష్టాన్ని తనలోనే ఉంచుకుంటూ ఆమెను ప్రతిరోజు చూసేవాడు. ఆమె కూడా అతను ఎందుకు చూస్తున్నాడా అని పవన్ కళ్యాణ్ వైపు రోజు చూస్తూ ఉండేది. ఒకరోజు తన స్నేహితులు ఈ విషయం తెలుసుకొని ఆ అమ్మాయి కళ్ళు చూస్తే ఆ అమ్మాయి నిన్ను కూడా ప్రేమిస్తున్నట్టు ఉంది ఒకసారి ప్రపోజ్ చేసి చూడరా... నిన్ను చూడగానే ఆ అమ్మాయి మొహంలో వెలుగు కనపడుతుంది అని ఉచిత సలహాలు ఎన్నో ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ బాగా ధైర్యం తెచ్చుకున్నాడు కానీ ఆమె వద్దకు వెళ్లేందుకు కాస్త వెనుకడుగు వేశాడు. కంప్యూటర్ కోర్సు పూర్తయిన అనంతరం తాను తన ప్రేమను ఆమెకు చెప్పాలని నిర్ణయించుకొని ఒక కారు ని తీసుకొని ఆమెను ఫాలో చేసి ఆమెను ఇంటి దగ్గర దించుతానని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్ కారు ఎక్కింది.


మార్గమధ్యంలో ఒక చోట కారు ఆపి... బాగా ధైర్యం తెచ్చుకుని హీరో లెవెల్ లో ఆమెకు ప్రపోజ్ చేసాడు పవన్ కళ్యాణ్. దీంతో షాక్ అయిన సదరు అమ్మాయి ఇందుకేనా నన్ను నువ్వు కారు లో ఎక్కించుకున్నది? అని చడామడా తిట్టింది. సరిగ్గా మీసాలు కూడా రాలేదు అప్పుడే నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా అంటూ ఆమె తిట్టిన తిట్లుకు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా హడలి పోయాడు. ఆమె వెంటనే కారు దిగి 'ఇంకోసారి నా జోలికి వస్తే బాగోదు. సరిగ్గా చదువుకొని బాగా పడు', అని చెప్పి వెళ్ళిపోయింది. దీంతో జ్ఞానోదయమైన పవన్ కళ్యాణ్ ఈ విషయం ఇంట్లో తెలుస్తుందో అని భయపడుతూ కొన్ని రోజుల పాటు చాలా సైలెంట్ గా ఉండిపోయాడట. ఆ తర్వాత ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా హీరో అయ్యేంతవరకు పుస్తకాలు చదవడం, ఇతర కళల లో నైపుణ్యం పొందడం లాంటివి చేసాడు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: