టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు జనాలు ఎప్పటికి మరువలేనివిగా ఉంటాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చిన్న హీరోల సినిమాలు అయినా సరే అవి కథ బాగుంది అనుకుంటే చాలు ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. సినిమాలో మంచి కథ ఉంది అంటే మాత్రం మిస్ అవకుండా చూస్తారు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా అతడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా సరే జనాలు  ఆ సినిమాను ఇప్పటికీ టీవీ లో వస్తే మాత్రం మిస్ అవ్వకుండా చూస్తారు. ఇప్పుడు ఆ సినిమా రెండో భాగం రెడీ అవుతుంది అని సమాచారం. 

 

సినిమా సీక్వెల్ ని రెడీ చేసే అవకాశం ఉంది అని టాక్. దీనికి సంబంధించి మహేష్ బాబు తో త్రివిక్రమ్ ఇప్పటికే చర్చలు కూడా జరిపారు అని సమాచారం. మరి ఎంత వరకు నిజం అనేది చూడాలి. దీనికి నిర్మాతగా వ్యవహరించేది ఎవరు అనే దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని టాక్. అయితే 2022 లో ఈ సినిమా రావొచ్చు అని భావిస్తున్నారు.  మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత ఈ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని కూడా అంటున్నారు. 

 

ఈ సినిమాకు సంబంధించి త్రివిక్రమ్ కథ రెడీ చేసారు అని అందులో మార్పులు అవసరం ఉంది అని అందుకే లేట్ అయ్యే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటుగా మరో స్టార్ హీరో కూడా ఉండే అవకాశం ఉంది అని సమాచారం. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అని మహేష్ బాబు ఎప్పటి నుంచో భావిస్తున్నాడు. అది ఈ సినిమానే అయ్యే అవకాశం ఉంది అని టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: