ఎప్పుడూ ఏదో ఒక ధమాకా న్యూస్ తో వార్తల్లో వుంటుంది అంజలి! ఇప్పుడు అలాంటి న్యూసేం బయలుదేరింది అంటారా? మరేం లేదు అంజలి ఓ సినిమా చేసింది.అందులో ఓ హీరో వున్నాడు. దాన్ని ఓ దర్శకుడు డైరెక్ట్ చేశాడు. అసలు ఇందులో పెద్ద విశేషం ఏంటి అనుకుంటున్నారు కదూ! విశేషం వుంది... అంజలి సరసన నటించిన హీరో ఎవరు? ఆయన్ని హీరోగా పెట్టి సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు? ఇవి తెలిస్తే అందరూ అవాక్కైపోతారు. దీనికి సంబంధించిన న్యూస్ ను ఏపిహెరాల్డ్.కం ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. సీతమ్మ వాకిట్లో సినిమాతో టాప్ హీరోయిన్ అయిపోయిన అంజలి మసాలా తరువాత ఆఫర్లు లేక డల్ అయింది. అయితే, ఆమె ఏ సినిమా చేయటం లేదని భావించిన వారందరికీ షాకిస్తూ త్వరలో ఓ సినిమాలో కనిపించనుంది. షాక్ ఎందుకంటే అంజలి ఈ సినిమాలో ఓ కామెడియన్ సరసన హీరయిన్ గా కవ్విస్తుంది. ఆ కామెడియన్ శ్రీనివాస్ రెడ్డి. చాలా సినిమాల్లో హీరో ఫ్రెండ్స్ లో ఒకడిగా కనిపించి నవ్వించే ఈయన అంజలి స్టారర్ మూవీలో హీరో అయిపోయాడు! శ్రీనివాస్ రెడ్డి హీరోగా సినిమా అంటూ ఆ మధ్య వార్తలొచ్చినా తరువాత పెద్దగా సమాచారం లేదు. అయితే అంజలి, శ్రీనివాస్ రెడ్డి జంటగా ఓ సినిమాని దర్శక, నిర్మాతలు సైలెంట్ గా రెడీ చేసేశారట! త్వరలో విడుదల కూడా చేయబోతున్నారు. సో... అందుకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మీడియాకి లీక్ లు అందుతున్నాయి! పైగా ఈ సీక్రెట్లీ షాట్ మూవీకి.... ప్రముఖ రైటర్ కోన వెంకట్ డైరెక్టర్ అని కూడా తెలుస్తోంది! అంటే... మాంచి పంచింగ్ కామెడీ గ్యారెంటీ అనుకోవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: