స్నేహం.. ఈ పథంలోనే ఏదో తెలియ‌ని అనుబంధం దాగిఉంటుంది. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది. జీవిత‌కాలం మ‌న‌తోనే ఉంటుంది. అటుంటి స్నేహానికి ఉన్న గొప్పదనం గురించి ఎన్ని రకాలుగా చెప్పినా ఇంకా ఏదో మిగిలిపోయే ఉంటుంది. అయితే స్నేహ ప్రాధాన్యతను తెలిపే సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. స్నాహానికి ఉన్న గొప్ప‌ద‌నం తెలిసేలా చేశాయి.

 

అలాంటి సినిమాల్లో `ఎవడే సుబ్రహ్మణ్యం` చిత్రం కూడా ఒక‌టి. నాని, విజయ్ దేవరకొండ స్నేహితులుగా న‌టించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా న‌టించింది.  నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంది. లైఫ్ లో నువ్వు ఎవరూ అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ తోనే తెలుస్తుంది అనేది మనసా వాచా నమ్మి అనుసరిస్తున్న వాడు సుబ్రమణ్యం(నాని)అలియాస్ సుబ్బు. ఇలాంటి సుబ్బుకు.. రిషి(విజయ్ దేవరకొండ) అనే చిన్ననాటి స్నేహితుడు ఉంటాడు. రిషి మాత్రం జీవితం ఉన్నది అనుభవించటానికి, ఆనందించటానికి అనే ఫిలాసఫిని ఫాలో అవుతాడు.

 

ఇక రిషి తనకు అత్యంత ఇష్టమైన హిమాలయాలలోని రిషికేష్ దగ్గరలోని ధూథ్ కాశి వెళ్దామని బలవంటపెడతాడు. సుబ్బు దానికి ఒప్పుకోడు. అయితే అనుకోకుండా ఆక్సిడెంట్‌లో రిషి చనిపోతే, ఆనంది(మాళవిక నాయర్) ప్రోద్బలంతో సుబ్రహ్మణ్యం రిషి అస్థికలను ధూథ్ ‌కాశిలో కలపడానికి అయిష్టంగానే బయలుదేరుతాడు. ఈ ప్రయాణంలో సుబ్బుకు ఎలాంటి జీవిత సత్యాలను నేర్పింది.. ఎలాంటి అనుభవాలను పరిచయం చేసింది అన్న‌దే మిగిలిన సినిమా.

 

క్లారిటీగా చెప్పాలంటే.. చనిపోయిన స్నేహితుడి కోరికను తీర్చడం కోసం దూద్ కాశీ అనే ప్రాంతాన్ని సందర్శించడానికి పూనుకున్న.. ఓ మిత్రుడి కథ `ఎవడే సుబ్రహ్మణ్యం`.  ఇందులో భాగంగా విజ‌య్ స్నేహం కోసం ధూథ్ ‌కాశిలో వెళ్లే స‌మ‌యంలో నాని చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ఈ క్ర‌మంలోనే నాని తానేంటో తెలుసుకుంటాడు. ఇక ఈ చిత్రంలో సుబ్రహ్మణ్యం పాత్రలో నాని, రిషి పాత్రలో విజయ్ దేవరకొండ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఎప్పటికీ మ‌ర్చిపోలేరు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: