టాలీవుడ్ లో త్రివిక్రమ్ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తో సినిమా అనగానే చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి గానూ ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి. ఆయన కూడా చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఆయన ఒక సినిమా చేస్తున్నారు. బన్నీ సినిమా అవగానే ఆయన ఈ సినిమా కథను రెడీ చేసారు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ఆయన కాస్త జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు. 

 

ఎన్టీఆర్ కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఏ మాత్రం కూడా త్వరపడకుండా టైటిల్ ని ఖరారు చెయ్యాలి అని సూచనలు చేసారు అని చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు చిరంజీవి తో ఒక సినిమాకు ఆయన లైన్ చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కథ కూడా లాక్ డౌన్ లో రెడీ చేసారు అని ఆ కథను చిరు విన్నారు అని కూడా సమాచారం. త్వరలోనే ఈ కథకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు కూడా తీసుకుని వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో చేస్తుండగా ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ లో చేస్తున్నారు. ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి. అందుకే త్రివిక్రమ్ కూడా  లేట్ అయ్యే అవకాశం ఉండటం ఆచార్య తో పాటుగా ఈ సినిమా కూడా చేస్తాను అని చిరు చెప్పడంతో ఈ సినిమాను లైన్ చేసారు అని వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: