వ్యవస్థలను కాపాడేది పోలిస్. మనుషులకు భద్రత కల్పించేది పోలిస్. ఎవరికైనా వ్యవస్థలో సమస్య వస్తే వెళ్లేది పోలిసుల వద్దకే. ఇంతటి బలమైన వ్యవస్థ నిజ జీవితంలో ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించేది సినిమా. పోలీస్ పవర్ ను ఎందరో హీరోలు, హీరోయిన్లు తమ నటనతో సెల్యూట్ కొట్టించారు. ఎన్నో సినిమాలు పోలీస్ వ్యవస్థ బలాన్ని చూపించాయి. తెలుగులో అటువంటి సినిమాల్లో మొదటి వరుసలో ఉండేది.. ఠక్కున గుర్తొచ్చేది ‘అంకుశం’. హీరో రాజశేఖర్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో మార్చేసిన ఈ సినిమా విడుదలై నేటికి 31ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

పోలీసులే గర్వంగా ఫీలైన ఈ సినిమా 1989 జూలై 13న విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం సామాన్యమైంది కాదు. ప్రజల్లో, పోలీస్ వ్యవస్థలో కూడా పోలీసులపై గౌరవం పెంచిన సినిమా. ఇన్ స్పెక్టర్ విజయ్ పాత్రలో రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కెరీర్ హైలైట్ గా నిలిచింది. పోలీస్ అంటే ఇంత నిజాయితీ, పౌరుషంగానే ఉండాలి అనేంతగా ఆయన నటించాడు. సినిమాలో విలన్ గా నటించిన రామిరెడ్డి పేరు మోగిపోయింది. ఏకంగా ఉత్తమ విలన్ గా నంది అవార్డు సాధించారు. బాబూమోహన్ కూడా ఎంతో పాపులర్ అయ్యాడు.

IHG

 

ఎంఎస్ ఆర్ట్స్ బ్యానర్ అందించిన కథకు ఉత్తమ కధా రచయిత అవార్డు వచ్చింది. అంతే పవర్ ఫుల్ సినిమాగా తీర్చిదిద్దారు కోడి రామకృష్ణ. రాజకీయం, పోలీస్ వ్యవస్థను బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ తరహా సినిమాలకు తన దర్శకత్వం పవర్ చూపించారు. రాజశేఖర్ కెరీర్లోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది. సినిమాలో ముఖ్యమంత్రిగా ఎంఎస్ రెడ్డి నటించారు. హీరోయిన్ గా జీవిత నటించింది. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ ఎంట్రీగా హిందీ రీమేక్ లో నటించారు.

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: