టాలీవుడ్ మాస్ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన బోయపాటి శ్రీను, తొలిసారిగా దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన భద్ర సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవడం జరిగింది. మాస్ మహారాజ రవితేజ హీరోగా, మీరా జాస్మిన్ హీరోయిన్ గా మంచి యాక్షన్, ఎమోషనల్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ కొట్టి, తొలి సినిమాతోనే దర్శకుడిగా బోయపాటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వెంకటేష్ తో బోయపాటి తీసిన తులసి, అలానే బాలయ్యతో తీసిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కొట్టి మాస్ దర్శకుడిగా బోయపాటి శ్రీనుకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. 

IHG

ఇక ఇటీవల యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. మంచి యాక్షన్, మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా, జగపతి బాబు ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇక బాక్సాఫీస్ తెరపై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, ఇటీవల హిందీలో డబ్ కాబడి యూట్యూబ్ లో ప్రదర్శితం అవుతోంది. ఖూన్కార్ పేరుతో డబ్ అయిన ఈ సినిమా, గత ఏడాది ఫిబ్రవరిలో యూట్యూబ్ లో అప్ లోడ్ చేయబడి, నేటితో ఏకంగా 268 మిలియన్ల వ్యూస్, అలానే 1.4 మిలియన్ల లైక్స్ దక్కించుకోవడం జరిగింది. 

 

ఎక్కువగా హిందీ లో డబ్ అయ్యే టాలీవుడ్ బడా హీరోల సినిమాలకు మాత్రమే ఈ రేంజ్ లో వ్యూస్ వస్తాయని, అయితే ఈ సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్, ఎమోషన్, మంచి సాంగ్స్, అదిరిపోయే ఫైట్స్ వంటివి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో దీనికి ఈ విధంగా యూట్యూబ్ ని షేక్ చేసే రేంజ్ లో వ్యూస్ రావడం జరిగిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: