నెల రోజుల క్రితం అగ్ర దర్శకుల్లో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం లేదు. షూటింగ్ పర్మీషన్ కోసం.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన దర్శకులు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. గతంలో చూపించిన ఎగ్జయిట్ మెంట్ ప్రస్తుతం ఎందుకు లేదో తెలుసా.. 

 

రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్.. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఆచార్య షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయారు. ఆర్ఆర్ఆర్ ను జనవరి 8న రిలీజ్ చేయాల్సి ఉంది. ఆచార్యను దసరాకు తీసుకురావాలన్న పట్టుదలతో చిత్ర యూనిట్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేశాడు. ఇలా అగ్ర దర్శకులందరూ తమ సినిమా షూటింగ్స్ కోసం ప్రభుత్వంతో రెండు దఫాలుగా చర్చలు జరిపి పర్మీషన్ తీసుకొచ్చారు. 

 

తెలుగు సినిమా పెద్దల విన్నపాన్ని మన్నించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు పర్మీషన్ ఇచ్చాయి. కానీ.. ఇంతవరకు ఒక్క పెద్ద సినిమా కూడా సెట్స్ పైకి రాలేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ డూపులతో రాజమౌళి టెస్ట్ షూటింగ్ నిర్వహించినా.. వర్కవుట్ కాలేదు. దీంతో.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడం లేదు. 

 

ఆర్ఆర్ఆర్ కథ ఒకలా ఉంటే.. ఆచార్య కథ మరోలా ఉంది. కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోవడంతో.. స్టార్ హీరోలు భయపడిపోయారు. ఎందుకొచ్చిన రిస్క్ అంటూ వెనక్కి తగ్గారు. పర్మీషన్ ఇచ్చిన వెంటనే ఆగస్ట్ లో షూటింగ్ మొదలు పెట్టాలని చిరంజీవి భావించినా.. వయసు రీత్యా సేఫ్ కాదని ఇచ్చిన సలహాలతో కాలు బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు మెగాస్టార్. దీంతో పర్మీషన్ కోసం అగ్రహీరోలు.. స్టార్స్ చేసిన సందడికి ఉపయోగం లేకుండా పోయింది. 

 

మొత్తానికి కరోనా వైరస్ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై భారీగా పడింది. ఎలాగోలా సినిమా షూటింగ్స్ వెళ్తామని ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఒకే అనిపించుకున్నా.. కరోనా కేసులు తెగ భయపెట్టిస్తున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక అగ్రదర్శకులు ఢీలా పడిపోయారు. ఎప్పుడు కేసులు తగ్గుతాయో.. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్స్ కు వెళ్లాలో అర్థం కాక జుట్టుపీక్కుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: