సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని హ్యాట్రిక్ వియాలు దక్కించుకున్నారు. ఇకపోతే కొద్దిరోజుల క్రితం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఆయన నటించబోయే నెక్స్ట్ సినిమా సర్కారు వారి పాట కు సంబందించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయి అందరి నుండి విశేషమైన స్పందన దక్కించుకుంది. మహేష్ బాబు ఒక డిఫరెంట్ క్యారక్టర్ లో కనిపించనున్న ఈ సినిమాని బ్యాంకు మోసాలకు సంబందించిన కథని బేస్ చేసుకుని తెరకెక్కించనున్నట్లు టాక్. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ద్వారా తొలిసారిగా కీర్తి సురేష్, సూపర్ స్టార్ తో జతకడుతోంది. ఇక కొన్నేళ్ల నుండి మహేష్ బాబు కెరీర్ లైనప్ ని కొంత పరిశీలిస్తే ఒక విషయం మనకు స్పష్టం అవుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

IHG

శ్రీమంతుడు తరువాత బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు చేసిన మహేష్, వాటితో పెద్ద పరాజయాలు మూటగట్టుకున్నారు. అయితే ఆ తరువాత రెండవ సారి కొరటాల శివతో కలిసి మహేష్ చేసిన సినిమా భరత్ అనే నేను. అంతకముందు వీరిద్దరూ కలిసి చేసిన శ్రీమంతుడు అతి పెద్ద హిట్ అందుకోవడంతో, కొరటాల మీద నమ్మకం కలిగి భరత్ అనే నేనుకు అవకాశం ఇచ్చారు మహేష్. కాగా మంచి పొలిటికల్ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి మహేష్ కు కెరీర్ పరంగా మంచి బ్రేక్ ని ఇచ్చింది. ఆ తరువాత ఇద్దరు స్నేహితుల మధ్య స్నేహబంధాన్ని బేస్ చేసుకుని పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కిన మహర్షి, అలానే మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా పక్కాగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు కూడా వరుస సూపర్ హిట్స్ కొట్టి ఆయనకు హ్యాట్రిక్ అందించాయి. 

 

అయితే బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల్లోని కథ కథనాల్లో లోపాలతో పాటు, మహేష్ ఇమేజ్ కి తగ్గ కమర్షియల్ హంగులు వంటివి లేకపోవడంతో అవి రెండు సక్సెస్ కాలేదని, అలానే భరత్ అనే నేను నుండి మొన్నటి సరిలేరు వరకు పరిశీలిస్తే మహేష్, ఇకపై దాదాపుగా ప్రతి సినిమాలో తన ఇమేజ్ కు సరిపోయేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటున్నట్లు అర్ధం అవుతోందని అంటున్నారు. అదీకాక ఇటీవల మహేష్ కూడా పలు ఇంటర్వ్యూ ల్లో భాగంగా మాట్లాడుతూ, తనకు గతంలో వచ్చిన పరాజయాలు సరిగ్గా కథ, కథనాలు తన ఇమేజ్ కు తగ్గట్లు ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకోకుండా ముందుకు సాగడం వలన వచ్చాయని, అయితే ఇకపై తాను ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అందరూ తన నుండి ఆశించే అన్ని అంశాలు కలగలిపిన సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతానని చెప్పడం జరిగింది. కాగా అతి త్వరలో తెరకెక్కనున్న సర్కారు వారి పాట కూడా మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనుందని మహేష్ తెలిపారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: