కరోనా వైరస్ వల్ల భారీగా సినిమా ఇండస్ట్రీ నష్టపోయింది. సరిగ్గా సమ్మర్ సమయంలో సినిమాలు విడుదల కావాల్సిన సమయం లో బాక్సాఫీస్ దగ్గర భారీగా బిజినెస్ మొదలవుతుంది అన్న టైం లో మహమ్మారి కరోనా ఎంటర్ అయ్యింది. దెబ్బకి దేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్ళిపోయింది. థియేటర్లు మరియు షూటింగులు మొత్తం ఆగిపోవటంతో ఇండస్ట్రీ ఈ వేసవి చాలా నష్టపోయింది. ఇదిలా ఉండగా ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కువగా నష్టపోయిన డైరెక్టర్లు పేర్లు ఇండస్ట్రీ లో వైరల్ అవుతున్నాయి. వారిలో ముఖ్యంగా వినబడుతున్న పేరు కొరటాల శివ. 'భరత్ అనే నేను' తో భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవితో సినిమా కోసం మంచి సక్సెస్ లో ఉన్న టైంలో సంవత్సరం వెయిట్ చేశారు కొరటాల.

 

ఆ తర్వాత ఇప్పుడు సరిగ్గా షూట్ మొదలయ్యాక కరోనా రావడంతో కొరటాల శివ టైం చాలా వేస్ట్ అవుతుందనే వార్తలు బలంగా వినబడుతున్నయి. ఈ విధంగానే బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో సినిమా స్టార్ట్ చేసి కరోనా రాకతో సమయం చాలా వృధా చేసుకుంటున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇదే తరహాలో శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఆ తరువాత ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో 'అసురన్' రీమేక్ కి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. కానీ వెంకటేష్ నటించిన 'నారప్ప' సినిమా రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆశ పడిన టైమ్ లో కరోనా అడ్డుపడటంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

 

ఇదే రీతిలో బొమ్మరిల్లు సినిమా తర్వాత ఇండస్ట్రీలో క్లాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన బొమ్మరిల్లు భాస్కర్ కి తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో అవకాశాలు రాకుండా పోయాయి. ఇలాంటి తరుణంలో అక్కినేని ఫ్యామిలీ వారసుడు అక్కినేని అఖిల్ తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే బంపర్ లక్కీ సినిమా చేసే అవకాశం వచ్చింది. సినిమా చాలా వరకు కంప్లీట్ అయి ఇక త్వరలో రిలీజ్ అవుతున్న తరుణంలో కరోనా ఎఫెక్ట్ తో రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని  బొమ్మరిల్లు భాస్కర్ మంచి తహతహలాడుతున్న కరోనా కరుణించడం లేదు. అదేవిధంగా సురేందర్ రెడ్డి మరియు వంశీ పైడిపల్లి ఇంకా కొంత మంది డైరెక్టర్లు కరోనా వైరస్ ఎఫెక్ట్ తో వాళ్ళ కెరీర్లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: