టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో లుక్ విషయంలో ప్రతి సినిమాకి వేరియేషన్ చూపించడంలో అందరికంటే ముందు ఉంటాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 'గంగోత్రి' సినిమా తో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన టైములో అల్లు అర్జున్ ని చూసి చాలా దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది. ఆ తరువాత వెంటనే 'ఆర్య' సినిమాతో ఎవరైతే తనని చూసి విమర్శలు చేశారో వారి నోటితోనే శభాష్ అనిపించేలా తన లుక్ మార్చుకున్నాడు. ఆ తర్వాత బన్నీ సినిమాతో కండలు పెంచి ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ స్టార్ డం "స్టైలిష్ స్టార్" అనే రీతిలో అల్లు అర్జున్ తనని తాను ఆవిష్కరించుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చాడు. దేశముదురు సినిమాతో దక్షిణాదిలో ఏ హీరో చేయని విధంగా మొట్టమొదటి సారి సిక్స్ ప్యాక్ తో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.

 

ఆ తరువాత పరుగు మరియు ఆర్య 2 అదేవిధంగా వరుడు, వేదం, బద్రీనాథ్ సినిమాలతో తన లుక్స్ మార్చుకోవటం జరిగింది. యాంగ్ జనరేషన్ ని అలరిస్తూ జులాయి' 'ఇద్దరమ్మాయిలతో' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'రేసుగుర్రం' సినిమాలతో బన్నీ బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా కోసం లాంగ్ హెయిర్ పోనీ టైల్ తరహాలో గుబురు గడ్డంతో పక్క ఊర మాస్ గా చాలా రఫ్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్నీ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇప్పటికే 'పుష్ప' సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ లో బన్నీ ని చూసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు. చాలా ఎబ్బెట్టుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. 'పుష్ప' సినిమా మొత్తం బన్నీ ఇలానే ఉంటాడా అనే ప్రశ్న బన్నీ అభిమానులను తొలిచేస్తుంది. సినిమా మొత్తం ఈ లుక్ అయితే కష్టమే అని అంటున్నారట. కానీ ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు రావటంతో సినిమా స్టోరీ బట్టి బన్నీ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అంటూ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: