తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పెద్ద కుటుంబాల్లో ఒకటి దగ్గుబాటి రామానాయుడు కుటుంబం. ఆయన స్థాపించిన సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు ఘన చరిత్ర ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్ ఎంత ప్రసిద్ధి చెందిందో.. ఆ ఇంటి నుంచి వచ్చిన వెంకటేశ్ కూడా సూపర్ స్టార్ గా రాణించి దగ్గుబాటి వారసత్వాన్ని నిలబెట్టాడు. వెంకటేశ్ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఓన్ ప్రొడక్షన్ లో కూడా వెంకటేశ్ కు ఘనమైన హిట్స్ ఉన్నాయి. ఆ హిట్స్ లో ఒకటి ‘కూలీ నెం.1’ ఈ సినిమా విడుదలై 29ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 1991 జూలై12న విడుదలైంది. రైల్వే కూలీగా మాస్ క్యారెక్టర్ లో రాణించాడు వెంకటేశ్. ‘నా బిళ్ల కూడా ఊడదు..’ అంటూ వెంకీ చెప్పిన మాస్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కుటుంబ కథ కూడా ఇమిడి వున్న ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. టబూ ఈ సినిమా ద్వారా సినిమాల్లో హీరోయిన్ గా పరిచయమైంది. తన అందంతో సినిమాలో ఆకట్టుకుంటుంది. సినిమాలో పరుచూరి వెంకటేశ్వరరావు, మోహన్ బాబు మధ్య వచ్చే కామెడీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది.

IHG

 

ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..’ అనే పాట ఇప్పటికీ ప్రతి వినాయకచవితి పండక్కి వినపడుతూనే ఉంటుంది. ‘కలయా.. నిజమా’ అనే పాటను స్వయంగా ఇళయరాజానే ఆలపించడం విశేషం. కె.రాఘవేంద్రరావు మాయాజాలంతో ఈ సినిమా శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి జ్ఞాపకాన్ని పంచుకుంది సురేశ్ సంస్థ. రామానాయుడు, రాఘవేంద్రరావు, వెంకటేశ్, మోహన్ బాబు, పరుచూరి, రావుగోపాలరావు.. సరదాగా షూటింగ్ స్పాట్ లో ఉన్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: