టాలీవుడ్ దిగ్గజ నటుడు నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ  ఇప్పటివరకు తన కెరీర్ పరంగా 350 సినిమాల్లో నటించారు. కేవలం హీరోగానే కాక, తన సోదరులతో కలిసి పద్మాలయ స్టూడియోస్ సంస్థను నిర్మించి తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా పలు నిర్మించి సక్సెస్ లు అందుకున్న ఘనత కృష్ణది. ఇకపోతే దర్శకుడుగా కూడా పలు సినిమాలు తీసిన కృష్ణ, వాటి ద్వారా కూడా మంచి విజయాలు, పేరు సంపాదించారు. టాలీవుడ్ అతి పెద్ద మాస్ హీరోగా కొన్నేళ్ల పాటు తిరుగులేని క్రేజ్ తో అప్పట్లో కొనసాగిన కృష్ణ, అప్పటి తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో సరికొత్త హంగులు, టెక్నాలజీలను పరిచయం చేసారు. అంతేకాదు ఒక ఏడాదికి ఏకంగా 18 సినిమాలు చేసిన ఏకైక హీరోగా, అలానే ఒక రోజులో అత్యధికంగా 18 గంటల పాటు వర్క్ చేసి, తనకు తానే సాటి అని నిరూపించుకున్న హీరో కృష్ణ. 

IHG

ఇక ఒక్కో సినిమాతో కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ టాలీవుడ్ కు ఎందరో కొత్త దర్శకులను, నిర్మాతలను పరిచయం చేసిన కృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో అన్న ఎన్టీఆర్ గారికి సమానముగా పోటీ ఇచ్చిన కృష్ణ మొత్తం మూవీ కెరీర్ లో మాత్రం ఒక్క ప్రశ్నకు ఇప్పటికీ కూడా సమాధానం దొరకనే లేదు. అదేమిటంటే, దాదాపుగా టాలీవుడ్ లో అత్యధిక సినిమాల్లో నటించిన కృష్ణకు అవార్డుల పరంగా ఎంతో తీరని అన్యాయం జరగడమే. ఇప్పటివరకు మొత్తంగా ఆయన కెరీర్లో అల్లూరి సీతారామరాజు సినిమాకు మాత్రమే ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కడంతో పాటు అక్కడక్కడా చాలా కొద్దిశాతం మాత్రం పలు సంస్థల అవార్డులు దక్కాయి. 

 

 

ఈ విషయమై కృష్ణను పలువురు ప్రెస్, మీడియా వారు ఎన్నోమార్లు, ఎన్నో సందర్భాల్లో అడిగిప్పటికీ, తన కెరీర్ లో ఎన్నో సినిమాలు మంచి విజయాలు అందుకున్నా కూడా వాటికి ఎందుకు అవార్డులు రాలేదు అనేది తాను కూడా చెప్పలేనని ఆయన అంటుండే వారు. ఇక ఆయన అభిమానుల్లో ఇప్పటికీ కూడా ఇదే పెద్ద అసంతృప్తిగా, లోటుగా మిగిలిపోయింది అనే చెప్పాలి. మరి ఏమి జరిగిందో, ఎక్కడ లోపముందో తెలియదు గాని, తెలుగు సినిమా పరిశ్రమ దిగ్గజ నటుడిగా పేరుగాంచిన సూపర్ స్టార్ కృష్ణకు అవార్డుల విషయమై మాత్రం ఎంతో తీరని అన్యాయం జరిగిందని ఇప్పటికీ చాలా మంది సినిమా ప్రముఖులు బహిరంగంగానే చెప్తూ ఉంటారు......!! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: