బంధుప్రీతి.. నెపోటిజం.. నెల రోజుల నుంచి బాలీవుడ్ లో ఈ ఒక్క టాపిక్కే నడుస్తోంది. దీనికి ఆజ్యం పోసేలా మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ మొత్తం నటీనటులే. ఇప్పటికే ఆ ఫ్యామిలీ మొత్తం నటీనటులే. తాజాగా స్టార్ హీరో మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నెపోటిజంకు బలం చేకూర్చేలా వస్తున్న ఆ వారుసుడు ఎవరో కాదు బిగ్ బి కుమార్తె కొడుకు. 

 

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బంధుప్రీతి గురించి విమర్శలు వస్తున్న సమయంలో.. అమితాబ్ మనవుడు నందా హీరోగా ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బి కుమార్తె శ్వేతా బచ్చన్ కొడుకు అగస్త్యకు చిన్న తనం నుంచే సినిమా ఇండస్ట్రీకి రావాలన్న కోరిక బలంగా ఉందట. ప్రస్తుతం కథలు వినడం స్టార్ట్ చేసాడనేది బీటౌన్ టాక్. 

 

బిగ్ బి ఫ్యామిలీలో కూతురు తప్ప అందరూ నటులే. బిగ్ బి భార్య జయా బచ్చన్ హీరోయిన్ గా నటించారు. కొడుకు అభిషేక్ బచ్చన్.. కోడలు ఐశ్వర్యరాయ్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సిినిమా ఫ్యామిలీ నుంచి మరో వారసుడు వస్తున్నాడు. అమితాబ్ కూతురు నవ్య నవేలి నందా వెండితెరపై రాకపోయినా.. మోడల్ గా రాణిస్తోంది. 

 

ఈ మధ్యకాలంలో నెపోటిజం ప్రస్తావన రాగా అభిషేక్ ఖండించాడు. బిగ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తన తొలి చిత్రం నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదనీ అభిషేక్ అన్నాడు. ఫ్యామిలీకున్న క్రేజ్ ఒకటి రెండు సినిమాలకే పనిచేస్తుందని. టాలెంట్ ఉంటేనే ఇక్కడ రాణిస్తారని పేర్కొన్నాడు. మరి బిగ్ బి మనవడు అగస్త్య నందా ఎంట్రీకి నిర్మాతలు దొరుకుతారో లేదో చూడాలి. 

 

మొత్తానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ నుండి మరో హీరో వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుంచి అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య ఇలా ఫ్యామిలీ అంతా వెండితెరపై మెరిశారు. తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నారు. జాతీయ అవార్డులను సొంతం చేస్తున్నారు. ఎన్నో సత్కారాలు అందుకున్నారు. ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. మరి అమితాబ్ మనవడు అగస్త్య వారి బాటలో నడుస్తాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: