ఇప్పుడు సోషల్ మీడియా అనేది సినిమాకు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా లేకుండా అసలు ఏది కూడా సినిమాల్లో జరిగే అవకాశ౦ అనేది కనపడటం లేదు అనే చెప్పాలి. సోషల్ మీడియాలోనే సినిమాల ప్రమోషన్ సహా అనేక కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్నాయి. దాదాపు అన్ని సినిమాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనే ప్రచారం చేసే పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్నీ కూడా దాని మీదనే తమ మార్కెట్ ని ఆధారపడుతున్నాయి. 

 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీడియా సంస్థలు కూడా ఇప్పుడు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ వ్యవాహారంలో తమ వంతు గా సహాయ సహకారాలు అందించి లాభ పడే విధంగా అడుగులు వేస్తున్నాయి అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి నిర్మాతలు ఒక నిర్ణయం తీసుకున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... సోషల్ మీడియాలో ఇక నుంచి సినిమాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అయితే యాక్టివ్ గా ఉంటారో వారికి కొంత ప్యాకేజి ఇస్తారట. 

 

అంటే ఏమీ లేదు. సినిమాలకు సంబంధించి కొన్ని కొన్ని వార్తలను చాలా ఫాస్ట్ గా ప్రజల్లోకి ఫాన్స్ రూపంలో తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారికి తమ వంతుగా సహాయం అందించి వాటిని ప్రమోషన్ చేసుకోవడానికి ఒక ప్లాన్ ని రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది తెలియదు గాని దీనిపై మాత్రం చాలానే చర్చలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. యాక్టివ్ గా ఉండే వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు తమ  తమ పరిచయాలను వాడుకుని ప్యాకేజి తీసుకోవాలి అని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: