టాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు గతంలో చాలా వరకు కూడా సినిమాల్లు చేయడం అనేది మనం చూస్తూ వచ్చాం. చాల మంది స్టార్ హీరోలు అలాగే సినిమాలు వరుసగా చేస్తూ ప్రతీ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు అనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి దాదాపుగా లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు ఒక విషయం ఏంటీ అంటే  చిన్న హీరోలు సినిమాలకు గ్యాప్ తీసుకుని కేవలం హీరో  పాత్రలు మాత్రమే కాదు కొన్ని కొన్ని వెబ్ సీరీసుల్లో కూడా నటించే ఆలోచనలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. 

 

అవును చిన్న హీర్లు అందరూ కూడా దాదాపుగా అదే ప్లాన్ లో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. నానీ కూడా ఒక వెబ్ సీరీస్ లో నటించే అవకాశం ఉంది అని టాక్. దీనికి సంబంధించి నానీ ఒక ప్లాన్ ని రెడీ చేస్తున్నాడు అని త్వరలోనే దీనికి సంబంధించి అతని వద్ద నుంచి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం ఆనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఒక షార్ట్ ఫిలిం లో నటించే అవకాశాలు ఉన్నాయి అనే కథనాలు వస్తున్నాయి. 

 

నిర్మాతలకు భారం కాకుండా ఉండటానికి వీరు భారీగా పారితోషికం కూడా తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు చాలా మంది హీరోలు చర్చలు జరుపుతున్నారు అని త్వరలోనే దీనికి సంబంధించి చాలా మంది హీరోల నుంచి ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి ఎంత మంది చేస్తారు అనేది చూడాలి ఇప్పుడు. ఇది ఎంత వరకు ఫలిస్తుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: