టాలీవుడ్ లో చాలా ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రకుల్ ప్రీత్ సింగ్. పాప సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండటం తో స్టార్ హీరోలు కూడా ఆమెను తమ తమ సినిమాల్లోకి తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు. నటన లేకపోయినా సరే ఆమెకు కమర్షియల్ హీరోయిన్ అనే గుర్తింపు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఆమె చాలా వరకు కూడా సినిమాలు చేయడానికి కష్టపడుతుంది అనే వార్తలను మనం చూస్తున్నాం. ఆమెకు అవకాశాలు అసలు రావడం చాలా కష్టంగా ఉంది అని టాలీవుడ్ లో చాలా మంది అంటున్నారు. 

 

అందుకే పాప ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చెయ్యాలి అని భావిస్తుంది. ఆమెకు మంచి పాత్రలు గతంలో వచ్చినా సరే ఆమె అందం మీద పెట్టిన ధ్యాస నటన మీద పెట్టలేదు అని అన్నారు. అందుకే ఆమెను అప్పటి నుంచి పక్కన పెట్టారు టాలీవుడ్ జనాలు. ఇప్పుడు ఆమె ఒక రెండు సినిమాల్లో చాలా వరకు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుంది అని అంటున్నారు. ఆమె వచ్చే ఏడాది విడుదల అయ్యే ఒక స్టార్ హీరో సినిమాలో  ఒక వేశ్య పాత్రలో నటిస్తుంది అని టాక్ మరి. 

 

అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనికి సంబంధించి ఇప్పుడు చాలానే చర్చలు జరుగుతున్నాయి అని ఆమె అందుకు దాదాపుగా ఓకే చెప్పింది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆమె వచ్చే ఏడాది  చేసే రెండు సినిమాలకు కూడా ఎక్కువగా డిమాండ్ చేయలేదు అని రేటు పెంచడం లేదు అని అంటున్నారు. ఇక అందుకే ఆమెను తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేసే సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి ఆమె ప్రాక్టీస్ కూడా చేస్తుంది అని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: