మనం తెలుగు లో చాలా వరకు ఇప్పుడు సినిమాల్లో పాత పాటలను  పదే పదే చూస్తూ వస్తున్నాం. చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా పాత పాటలను ఏదోక విధంగా వాడుతూనే ఉన్నారు అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వాటికి మంచి స్పందన అనేది వస్తుంది. సోషల్ మీడియాలో సినిమాలను ప్రమోషన్ చేసుకోవడానికి గానూ ఇవి చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంది అని భావిస్తున్నారు.  ఇప్పుడు మహేష్ బాబు తన తర్వాతి సినిమా సర్కారు వారి పాట కు సంబంధించి తన తండ్రి సినిమాలో ఒక పాట ను వాడే ఆలోచనలో ఉన్నాడట. 

 

గ్రామాల్లో రైతులకు సంబంధించి ఆయన ఒక పాట వాడే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని దీనిపై మాత్రం ఇప్పుడు చర్చలు  చాలానే జరుగుతున్నాయి. మహేష్ బాబు చాలా వరకు దీనిని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని భావిస్తున్నాడు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. మరి అది ఏ పాట అసలు ఏంటి అనేది చూడాలి. గ్రామాల్లో వ్యవసాయం గురించి బాగా వివరించే అవకాశం ఉంటుంది అని టాక్. మరి  అది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి. 

 

కాగా మహేష్ బాబు ఇప్పుడు ఒక సినిమాతో పాటుగా వెబ్ సీరీస్ లో కూడా నటించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమాలో చేస్తాడో అనేది చూడాలి. ఇప్పుడు మహేష్ చేతిలో రాజమౌళి సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమా కథ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: