టాలీవుడ్ లో యువ హీరోల సినిమాల్లో ప్రత్యేకంగా ఫాన్స్ లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండే హీరో విజయ్ దేవరకొండ. బాబు సినిమా వస్తుంది అంటే చాలు చాలా మంది ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత బాబుకి చాలా మంచి ఫాలోయింగ్ అనేది వచ్చింది. అతని సినిమాలను అప్పటి నుంచి బాలీవుడ్ జనాలు  కూడా ఫాలో అవుతున్నారు అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. ఆ సినిమాను బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయగా అక్కడ మంచిగా హిట్ అయింది. ఇక అక్కడి నుంచి బాబుకి అక్కడ కూడా ఫాలోయింగ్ వచ్చింది. 

 

ఇప్పుడు అతను ఏకంగా షాహిద్ కపూర్ సినిమాలో నటించే అవకాశం కొట్టేసాడు అని టాక్. అతను ఇప్పుడు పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాను కరణ్ జోహార్ తో కలిసి పూరి నిర్మిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత విజయ్ కరణ్ జోహార్ తో కలిసి ఆ సినిమా చేసే అవకాశం ఉంది అనే ప్రచార౦ బాగానే జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించి చర్చలు నడుస్తున్నాయి అని విజయ్ అందుకు ఓకే చేసాడు అని అంటున్నారు మరి. 

 

ఈ సినిమాలో విజయ్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్ మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే ఆగాలి. ఇక అతను ఒక తమిళ సినిమాలో కూడా నటించే అవకాశం ఉంది అనే కథనాలు కూడా వస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన విజయ్ నుంచే వచ్చే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. చూద్దాం అసలు ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: