టాలీవుడ్ లో ఆర్ ఆర్ఆర్ సినిమా గురించి చాలానే చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే ఫాన్స్ ఎంతో ఆశగా చదువుతున్నారు. ఈ సినిమాలో మెగా నందమూరి హీరోలు ఇద్దరూ కలిసి నటించడం తో సినిమాపై బాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ లో క్రేజ్ అనేది వచ్చింది. ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత అనేది రావడం లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని వార్తలు వస్తున్నాయి. అవి ఏంటీ అనేది ఒకసారి చూస్తే.. 

 

ఈ సినిమాలో కొన్ని కొన్ని గెస్ట్ పాత్రలు ఉండే అవకాశం ఉంది అని అందులో స్టార్ హీరోలను చూపించే ఆలోచనలో జక్కన్న ఉన్నారు అని అంటున్నారు. బాలీవుడ్ లో సీనియర్ హీరోలు కొందరిని ఇప్పటికే రెండు పాత్రలకు సంబంధించి అడిగారు అని టాక్. అదే విధంగా కేరళ కు చెందిన కొందరు స్టార్ లను కూడా అడిగారు అని వారు కూడా అందుకు ఓకే చేసారు అనే వార్తలు వస్తున్నాయి. ఏమీ లేదు సినిమాకు మార్కెట్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి.  ఇప్పుడు కరోనా దెబ్బకు భారీగా మార్కెట్ పడిపోయే అవకాశాలు ఉన్న నేపధ్యంలో దర్శకుడు రాజమౌళి నిర్మాత దానయ్య మార్కెటింగ్ కోసం ఈ ప్లాన్ వేసారట. 

 

దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు దాదాపుగా జరుగుతున్నాయి అని అంటున్నారు. మరి ఎంత వరకు ఈ సినిమాలో వేరే వాళ్ళు నటిస్తారు అనేది చూడాలి. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని టాక్. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రలో కూడా కొన్ని మార్పులు చివర్లో చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఏ మార్పులో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: