హీరోయిన్లు కేవలం పాటల్లో డ్యాన్సులు చేయడానికి, గ్లామర్ ఒలకబోయడానికి మత్రమే పరిమితమైతే ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్ కొనసాగింపు కష్టమే. లాంగ్ కెరీర్ కావాలంటే హీరోయిన్ పాత్రల్లో వేరియేషన్లు చూపాల్సిందే. నటనకు ఆస్కారమున్న పాత్రలు, ప్రేక్షకులు మెచ్చే పాత్రలు చేయాలి. ఇలా నటించిన హీరోయిన్లెందరో మంచి పొజిషన్ చూశారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అడుగులు కూడా అటువైపే పడేలా కనిపిస్తున్నాయి. త్వరలో ఆమె నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

IHG

 

త్వరలో బాలీవుడ్ లో తెరకెక్కే ఓ సినిమాలో ఆమె వేశ్య పాత్ర చేయనుందని బీటౌన్ లో ఓ వార్త ప్రముఖంగా రౌండ్ అవుతోంది. ముంబై రెడ్ లైట్ ఏరియాకు సంబంధించిన కథతో తెరకెక్కే ఓ సినిమాలో ఈ పాత్ర చేసేందుకు అంగీకరించిందని అంటున్నారు. బాలీవుడ్ లో గత ఏడాది అజయ్ దేవ్ గణ్ తో దేదే ప్యార్ దే అనే సినిమా చేసింది. అలానే.. మార్జవాన్ అనే హిందీ సినిమాలో ఆమె ఓ స్పెషల్ సాంగ్ చేసింది. దీంతో ఆమె బాలీవుద్ లో సుపరచితురాలే. ఈ నేపథ్యంలో ప్రాస్టిట్యూట్ పాత్రకు రకుల్ ను సంప్రదించారని సమాచారం. నటనకు, గ్లామర్ కు కూడా ఆస్కారం ఉండటంతో ఈ పాత్ర చేసేందుకు అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి.

 

IHG

ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఏ సినిమా కూడా నిర్విఘ్నంగా షూటింగ్ జరుపుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో పరిస్థితులన్నీ చక్కబడ్డాకే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం గాసిప్ లా ఉన్న ఈ వార్తపై పూర్తి అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం రకుల్ తమిళ్ లో భారతీయుడు2, అయలాన్ సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా ఓ ప్రాజెక్టు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: