ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే చాలా తక్కువ మంది మాత్రమే తమ తండ్రుల స్టార్ ఇమేజ్ కాపాకుంటూ వస్తున్నారు.  ఎంతోమంది హీరోలు ఎక్కువగా ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. ఇక బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల తనయులు హీరోలుగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాకీష్రాఫ్ తనయుడు  టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు. అయితే తండ్రి బ్యాగ్ గ్రౌండ్ తో కాకుండా తన సొంత టాలెంట్ తో ఆడియన్స్ ని ఆకర్షిస్తున్నాడు టైగ‌ర్ ష్రాఫ్. సినియర్ హీరోలు అంటే ఎంతో భక్తి విశ్వాసాలు చూపించడమే కాదు.. వారి పట్ల ఎంతో గౌరవాన్ని చాటుకుంటున్నాడు.  

 

మార్షల్ ఆర్ట్స్ తో ఎన్నో రకాల స్టంట్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు.  ఎన్నో ర‌కాల‌ విన్యాసాల‌ను సైతం ఆయ‌న అల‌వోకగా చేస్తూ వస్తున్నాడు. సినిమా హీరో కాక ముందే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు టైగ‌ర్ ష్రాఫ్. ఈ క్ర‌మంలో ఓ టోర్న‌మెంటులో తైక్వాండో విన్యాసాలు చేసిన పాత వీడియోను టైగ‌ర్ సోమ‌వారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇందులో అక్ష‌య్ కుమార్ కూడా ఉండ‌టం విశేషం. టైగ‌ర్ తైక్వాండో చేస్తుండ‌గా అక్ష‌య్ మ‌రిన్ని కిక్కులు కొట్ట‌మంటూ అత‌న్ని ప్రోత్స‌హించాడు. అక్క‌డున్న అభిమానులు సైతం అత‌నిలోని ప్ర‌తిభ‌కు అబ్బుర‌ప‌డిపోతూ చ‌ప్ప‌ట్లు, ఈల‌ల‌‌తో ఉత్తేజాన్ని నింపారు.

 

ఆనాటి ఈ సంఘ‌ట‌న గురించి యాక్ష‌న్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ త‌న అనుభ‌వాల‌ను గుర్తు చేసుకుంటూ..  స‌హ‌జంగానే నాకు స్టేజ్ ఎక్కాలంటేనే భ‌యం. అలాంటిది లెజెండ‌రీ హీరో అక్ష‌య్‌.. న‌న్ను ప్రేక్ష‌కుల‌కు కొన్ని కిక్స్ చూపించ‌మ‌ని అడుగుతుంటే మ‌రింత భ‌య‌ప‌డిపోయాను. కానీ ఆ సమయంలో అక్షయ్ సార్ నన్ను ఎంతో ప్రోత్సహించడం చాలా సంతోషం అనిపించింది.  లాక్‌డౌన్ కాలంలో షూటింగ్స్‌కు బ్రేక్ ప‌డ‌టం, త‌న‌కు కావాల్సిన‌ స‌మ‌యం దొర‌క‌డంతో ఈ హీరో సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు మ‌రింత చేరువ‌య్యాడు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Usually have stage fright, and this particular day was even scarier when our legendary action hero @akshaykumar sir asked me to show a couple kicks to the audience at his tournament. Just glad i didn’t mess up🙉#pressure #throwback

A post shared by tiger Shroff (@tigerjackieshroff) on

మరింత సమాచారం తెలుసుకోండి: