ఈ మధ్యనే ఓ సర్వే జరిగింది. ఇంట్లో టీవీల్లో, స్మార్ట్   గా ఓటీటీల్లో మూవీస్ చూస్తున్నా పెద్దగా ఫీలింగ్ కలగడం లేదని ఆడియన్స్ చెప్పారట. ఎంతైనా ధియేటర్లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు అని భారంగా  జనం అంటున్న మాటలు కూడా సర్వేలో హైలెట్ అయ్యాయట.

IHG

అంటే కరోనా వచ్చినా కూడా థియేటర్ల మీద జనాలకు మోజు పోలేదు, పైగా పెరిగిందిట. అన్నింటిలాగానే తగిన జాగ్రత్తలు తీసుకుని సినిమా హాల్ కి వెళ్ళి పెద్ద తెర మీద బొమ్మ చూస్తే ఆ సరదావే వేరు అని సగటు జనం నుంచి సంపన్నుడి దాక అంటున్న మాట. అదే అసలైన మనసులో మాట.

IHG

మరి ఈ మాట పాలకులకు వినిపించిందో లేక కరోనాతో సహజీవనంలో భాగంగా అన్నీ తీస్తున్నారు కదాని థియేటర్ల విషయంలోనూ సానుకూలత చూపిస్తున్నారో తెలియదు కానీ సీనీ గోయర్స్ కి ఇదొక శుభవార్తే. 

IHG

ఆగస్ట్ 1 నుంచ్ థియేటర్లు రీ ఓపెన్ చేయాలని కేంద్రం ఆలోచన చేస్తోందని టాక్. సినిమా హాళ్ళు మూత పడి నాలుగు నెలలు అవుతోంది. దీని వల్ల కేంద్రానికి పన్నుల రూపంలో భారీ ఎత్తున వచ్చే ఆదాయానికి గండి పడింది. ఇక సినిమా హాళ్ళు తెరవక అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి దాని మీద ఆధారపడే వాళ్ళంతా కూడా ఇపుడు కటకటలాడుతున్నారు. 

IHG

ఈ నేపధ్యంలో కొన్ని కచ్చితమైన కండిషన్లు పెట్టి సినిమా హాళ్లను తెరిపించాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అదే కనుక నిజమైతే మళ్ళీ థియేటర్లు సౌండ్ చేస్తాయి. అక్కడ ఆడియన్స్ రీ సౌడ్ తో తెగ హడావుడి చేస్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: