బాలీవుడ్ కింగ్ అమితాబ్ బచ్చన్ కి కరోనా వైరస్ సోకడంతో భారతీయ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. 77 ఏళ్ల వయసులో అతనికి కరోనా వైరస్ సోకినప్పటికీ... చిన్నపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని... ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ముంబైలోని నానావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 44 ఏళ్ల అమితాబ్ బచ్చన్ కుమారుడైన అభిషేక్ బచ్చన్ కూడా కరోనా వైరస్ బాధితుడు అయ్యాడు. అతడి కోడలు అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ కి కొవిడ్-19 వ్యాధి బారిన పడింది.


ఎనిమిదేళ్ల మనవరాలు అయిన ఆరాధ్య బచ్చన్ కి కూడా కరోనా వైరస్ సోకడంతో యావత్ భారత దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రస్తుతం వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని ముంబై ఆస్పత్రి వైద్యులు తెలుపుతున్నారు. నిజానికి అమితాబ్ బచ్చన్ ఎంతో విలాసవంతమైన ఇంట్లో ప్రజలందరికీ దూరంగా ఉంటూ హాయిగా నివసిస్తుంటారు. అటువంటి వ్యక్తి కే కరోనా వైరస్ సోకిందంటే సినీ పరిశ్రమలో పనిచేసే మిగతా వాళ్ళు కూడా తమకు కరోనా రాదు అని అనడానికి గ్యారెంటీ ఏముంది అని ప్రశ్నించుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ కి కరోనా వైరస్ సోకడంతో ఆ ప్రభావం టాలీవుడ్ పరిశ్రమ పై కూడా బాగానే పడినట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం సీనియర్ యాంకర్ అయిన సుమ షూటింగులకు వెళ్లేందుకు తెగ భయపడిపోతుందట. అందుకే తన ప్రోగ్రామ్స్ ల చిత్రీకరణ సమయాలను మార్చ వలసినదిగా కోరిందట. ఇప్పటికే ఆమె క్యాష్, అలీ తో సరదాగా వంటి ఈ టీవీ ప్రోగ్రామ్ లో కనిపించింది. ఇకపై క్యాష్ ప్రోగ్రామ్ కి కొద్ది రోజులపాటు వెళ్లకుండా... కరోనా ఉద్ధృతి పూర్తిస్థాయిలో తగ్గిన అనంతరం మళ్లీ షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది. జబర్దస్త్ యాంకర్ అనసూయ కూడా కరోనా వైరస్ సోకుతుందేమోనని తెగ భయపడిపోతుందట. అందుకే ఆమె కూడా ప్రోగ్రాములు కి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాలి అనుకుంటుంది. ఈ మహమ్మారి సోకితే కుటుంబానికి దూరంగా ఉంటూ నానా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే బాగా ధనికులయినప్పటికీ రిస్క్ చేయడానికి బాగా భయపడుతున్నారు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: