గబ్బర్ సింగ్ ఒక ట్రెండ్ సెట్టర్. నిజానికి దబాంగ్ మూవీ బాలీవుడ్ ని షేక్ చేసింది. ఫ్లాప్స్ లో ఉన్న సల్మాన్ ఖాన్ని హిట్ల వైపు నడిపించింది. ఆ సినిమా రీమేక్ గా గబ్బర్ సింగ్ తీసారు. ఇక్కడ కూడా పవన్ ఫ్లాప్స్ నుంచి హిట్ ట్రాక్ పట్టాడు. కధ ఒక్కటే అయినా తెలుగులో గబ్బర్ సింగ్ మాత్రం అదిరిపోయే రేంజిలో ఉంటుంది.

IHG

ఇప్పటికీ ఎన్ని సార్లు మూవీ చూసినా ఫ్రెష్ నెస్ అలాగే ఉంటుంది. ఇక ఆ సినిమాలో పవన్ మేకోవరే వేరేగా ఉంటుంది. పవన్ని అలా డిజైన్ చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్ నిజంగా గ్రేట్ అనాలి. కధేంటి, కంటెంట్ ఏంటి అన్న దాని కంటే హీరో ఎలివేషన్ హీరో ద్వారా కామెడీ ట్రాక్ పండించడం. మాస్ మసాలాలూ, సాంగ్స్ ఎక్కడ పడాలో అక్కడే పడేలా  చూడడం ఇవ‌న్నీ చూసుకుంటే మాత్రం హరీష్ పక్కా ప్లానింగ్ ఏంటో అర్ధమవుతుంది.

IHG

2012లో వచ్చిన ఈ సినిమా తరువాత అత్తారింటికి దారేది తో మరో హిట్ పవన్ కొట్టారు. కానీ మాస్ కి పూనకాలు తెప్పించే సినిమాగా గబ్బర్ సింగే నే ఇప్పటికీ చూస్తారు. ఈ సినిమా రేంజిలో మరో సినిమా ఉంటుందా వస్తుందా అంటే దానికి హరీష్ శంకరే సమాధానం చెప్పాలి. అయితే లేటెస్ట్ గా హరీష్ శంకర్ పవన్ తో తాను చేయబోతే మూవీ గబ్బర్ సింగ్ ని మించి ఉంటుందని అంటున్నారు.

IHG

మరి పవన్ వకీల్ సాబ్, క్రిష్ తో సినిమా తరువాత హరీష్ ప్రాజెక్ట్ ఉంటుంది. అందువల్ల ఈ సినిమా మీద ఫ్యాన్స్ కి బాగా హోప్స్ ఉన్నాయి. దానికి తగినట్లుగానే ఈ సినిమా తప్ప మరేదీ లేదు తనకు, మరో ఏడాది  లేట్ అయినా కధ మీదనే కూర్చుని పక్కా మాస్ హిట్ ఇస్తానని అపుడే ప్రామిస్ చేశాడు హరీష్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: